సన్నిడియోల్ కు ‘Y’కేటగిరి భద్రత
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీ డియోల్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు 11 మందితో కూడిన వై కేటగిరిని కల్పించింది. ఇందులో ఇద్దరు కమాండోలు, మిగతావారు పోలీసులు ఉంటారు. ఇటీవల ఆయన ‘నేను నా పార్టీ, రైతులతో కలిసి ఉంటాను. ఎప్పడూ రైతులతోనే ఉంటాను. రైతుల శ్రేయస్సుకోసం మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైతులతో ప్రభుత్వం చర్చలు […]
కేంద్ర వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీ డియోల్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనకు 11 మందితో కూడిన వై కేటగిరిని కల్పించింది. ఇందులో ఇద్దరు కమాండోలు, మిగతావారు పోలీసులు ఉంటారు. ఇటీవల ఆయన ‘నేను నా పార్టీ, రైతులతో కలిసి ఉంటాను. ఎప్పడూ రైతులతోనే ఉంటాను. రైతుల శ్రేయస్సుకోసం మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తుంది’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన భద్రతా ద్రుష్ట్యా ప్రభుత్వం వై కేటగిరిని కల్పించింది.