Zoho Arattai: ఎంతో నమ్మకంగా ఉండే భారత్ మీద ఆంక్షలు విధించాడు. అడ్డగోలుగా మాట్లాడాడు. చివరికి సినిమాలను కూడా వదిలిపెట్టలేదు. అంతేకాదు అమెరికాలో ఉంటున్న భారతీయులను యుద్ధ ఖైదీలుగా తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతని ఆకృత్యాలు మామూలుగా లేవు. పైగా ఇన్ని దారుణాలను అమలు చేసుకుంటూ కూడా పైశాచిక ఆనందం పొందుతున్నాడు. భారతీయుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నోటితో వెక్కిరించి నొసటితో నవ్వుతున్నట్టుగా తన హావాభావాలు ప్రదర్శిస్తున్నాడు. ఇదంతా చదువుతుంటే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు.. అవును ఇప్పుడు అతడికే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.
పాకిస్తాన్ మీద అప్పట్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించాం. ఇప్పుడు మన మీద ఎక్కి సవారీ చేస్తున్న అమెరికా దేశానికి ఎకనామికల్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అందువల్ల ఇటీవల కాలంలో ఆయన స్వదేశీ మంత్రాన్ని విపరీతంగా జపిస్తున్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు మనదేశంలోని ఐటీ సంస్థలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే జోహో అనే స్వదేశీ కంపెనీ వాట్సాప్ కు పోటీగా అరట్టై అనే సోషల్ మీడియా మెసేజ్ యాప్ ను అందుబాటులో తీసుకొచ్చింది. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రమోట్ చేయడంతో తిరుగులేని స్థాయికి వెళ్ళిపోతోంది. ఇప్పటికే 60 లక్షల మించిన యూజర్లతో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రోజుకు నాలుగు లక్షల కొత్త యూజర్లతో తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంటున్నది. అయితే ఇక్కడితోనే కేంద్ర ప్రభుత్వం ఆగిపోలేదు. జోహో ఆధ్వర్యంలో కొనసాగుతున్న మిగతా వాటిని కూడా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక సర్కులర్ విడుదల చేసింది.
జోహార్ ఆధ్వర్యంలో ఆఫీస్ సూట్ ను వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలలో డాక్యుమెంట్లను పంపించడానికి.. ఇతర సందేశాలను పంపించడానికి జోహో ఆఫీస్ సూట్ ఉపయోగించాలని సూచించింది. ఇప్పటికే అరట్టై ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా సర్కులర్ విడుదల చేయడంతో అమెరికా కంపెనీల గుత్తాధిపత్యానికి భారత్ చెక్ పెట్టే అవకాశం ఉంది. వాట్సప్, గూగుల్ వంటివి అమెరికా కంపెనీలు. ఈ కంపెనీల ద్వారా అమెరికా భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇందులో భారత నుంచి సింహభాగం వాటా ఉంది. అయినప్పటికీ మన దేశం మీద అమెరికా లేనిపోని ఆంక్షలు విధిస్తూ తన పైశాచికాన్ని ప్రదర్శిస్తోంది. అందువల్లే అమెరికాకు బుద్ధి వచ్చే విధంగా నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఏకంగా ఎకనామికల్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు. మిగతావి భాగాలలో కూడా భారత కంపెనీలను చొప్పించే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదే గనక కార్యరూపం దాల్చితే అమెరికా ఆధిపత్యానికి దాదాపుగా ఎండ్ కార్డ్ పడినట్టే.
After the Army Chief, Airforce Chief, Defence Minister – another big statement :
“PoK is an integral part of India… It will return. This is our national resolve!”
— Dr. S. Jaishankar (EAM-India) pic.twitter.com/Y0bsQvxheG— Baba Banaras™ (@RealBababanaras) October 4, 2025