Rahul Gandhi: కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు పరిజ్ఞానం అవసరం. ముఖ్యంగా ప్రపంచ వేదికలలో ప్రసంగిస్తున్నప్పుడు నాయకులు విషయాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మాట్లాడాల్సి ఉంటుంది. ఇటీవల కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జెన్ జెడ్ ఉద్యమం వస్తుందని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. “నేను చెబుతోంది అబద్దమా నిజమా” .. అని అక్కడ ఉన్నవారిని అడిగాడు. దానికి అక్కడ ఉన్న యువతరం స్పందించింది. భారతదేశంలో నేపాల్ తరహాలో ఉద్యమం రాదని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ ముఖం మాడిపోయింది. కేటీఆర్ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా అభాసు పాలయ్యారు. అది కూడా ప్రపంచ వేదిక ముందు.
వాస్తవానికి ఒక రాజకీయ నాయకుడు పరిపక్వతతో మాట్లాడాలి. విషయం గురించి సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ప్రసంగించాలి. అలాకాకుండా బోడి గుండుకు అరికాలికి ముడిపెట్టి మాట్లాడితే వినే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. పైగా ఆయన పిఆర్ టీం లో పనిచేసే వారంతా సామాన్య జనం ఏమనుకుంటారో అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అందువల్లే ఆయనకు రాసిచ్చే ప్రసంగంలో ఏమాత్రం లౌక్యాన్ని చూపించడం లేదు. కొత్తదనాన్ని కనిపించనీయడం లేదు. పోనీ వాళ్లు అలా రాసినా.. కనీసం రాహుల్ గాంధీ అయినా సరే ఎరుకతో వ్యవహరించాలి కదా.. అది కూడా మర్చిపోయాడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు.
ఇటీవల కొలంబియా వర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం పట్ల దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఒకరి వెళ్లే కారు బరువు 3000 కిలోలు.. ఇద్దరు వెళ్లే ద్విచక్ర వాహనం బరువు 100 కిలోలు.. ఇలా ఎందుకు ఉంటుంది అంటే.. ప్రమాదం జరిగినప్పుడు ఇంజన్ కారు లోపలికి వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఎక్కువ మెటల్ వాడుతుంటారు. చిన్న ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని”.. రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు బిజెపి గట్టి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది..” రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన అవివేకాన్ని ప్రపంచ వేదికల ముందు ప్రదర్శిస్తూనే ఉంటారు. వాహనాల గురించి.. అందులో వాడే ఇంజన్ల గురించి సైంటిస్టులు చూసుకుంటారు. కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు సైంటిస్ట్ అయ్యారు. ఏదేదో మాట్లాడుతున్నారు.. తన పరువు తానే తీసుకుంటున్నారని” బిజెపి నేతలు మండిపడటం మొదలుపెట్టారు. బిజెపి నేత అమిత్ మాలవ్య ఒక అడుగు ముందుకేసి.. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఈ మాటలు ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.
కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులతో భారతదేశం గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడారు రాహుల్ గాంధీ. అక్కడ కూడా రాజకీయాలను ప్రస్తావించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం నాశనమైందని.. ఎన్నికల వ్యవస్థ వ్యక్తి పూజగా మారిపోయిందని.. ఇలాంటి విధానాలు సరికావని ఆరోపించడం నిజంగా భారతదేశ పరువు తీసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పరిపక్వతతో మాట్లాడాలని సూచిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఓట్ చోరీ అనడం సరికాదని.. దానిని పకడ్బందీ ఆధారాలతో నిరూపించాలని హితవు పలుకుతున్నారు.
At a time when India is emerging as a rising force on the global stage, its economy growing faster than any other, its citizens feeling the value of their passport and doors of opportunity opening worldwide, comes Rahul Gandhi, shaped by years of self-loathing and low… pic.twitter.com/weUcNOJeDT
— Amit Malviya (@amitmalviya) October 4, 2025