World Happiness Report
World Happiness Report: అష్టఐశ్వర్యాలు ఉన్నా.. ఆనందం లేని జీవితానికి అర్థం ఉండదు. నేటి సమాజంలో ఇల్లు, కారు, కోట్ల రూపాయలు ఉన్నా చాలా మంది సంతోషంగా లేరు. ఏమీ లేని పేదలు హ్యాపీగా ఉన్నారు. ఇదే విషయాన్ని తేల్చింది. వరల్డ్ హ్యాపీనెస్ట్ రిపోర్టు. భారతీయులు ఏమాత్రం సంతోషంగా లేరని ఈ నివేదికలో తేటతెల్లమైంది. తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యం, స్వేచ్ఛ. అవినీతి, వ్యక్తుల జీవన స్థితిగతుల ఆధారంగా ఐక్యరాజ్యసమితి రూపొందించిన 150 దుశాల జాబితాలో ఇండియా 126వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక ఫిన్‌లాండ్ వరుసగా ఏడోసారి మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో డెన్మార్క్, ఐస్‌లాండ్ ఉన్నాయి.
మనకన్నా ఆ దేశాలు మెరుగు..
ఇక ఐక్యరాజ్య సమితి వరల్డ్ హ్యాపీనెస్ట్ నివేదిక ప్రకారం భారత్ కన్నా మన పొరుగున్న ఉన్న పాకిస్తాన్, చైనా, నేపాల్ మెరుగ్గా ఉన్నాయి. మొత్తం 143 దేశౠల్లో అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించగా ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఈ నివేదిక ప్రారంభమైనప్పటి నుంచి తిలిసారి అమెరికా 23, జర్మనీ 24 స్థానాలు దక్కించుకున్నాయి. టాప్ 20లో కువైట్(12), కోస్టారికా(13) ఉన్నాయి. హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఐదో స్థానంలో ఉండగా, టాప్ టెన్ దేశాల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే 15 బిలియన్లకుపైగా జనాభా కలిగి ఉన్నా. టాప్ 20లో కెనడా, బ్రిటన్ మాత్రమే 30 మిలియన్లకుపైగా జనాభా ఉన్న దేశారు. ఇక ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, బోర్డాన్‌లు 2006 –10 నుంచి హ్యాపీనెస్‌లో తీవ్ర క్షీణత నమోదైనట్టు నివేదిక పేర్కొంది. సెర్బియా, బల్గేరియా లాట్వియా వంటి తూర్పు యూరోపియన్ దేశాలు పెరుగుదలను నమోదు చేశాయి.
ఫిన్‌లాండ్ హ్యాపీకి కారణాలివే..
ఫిన్‌లాండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి కారణాలను దేశంలోని హెల్సంకీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జెన్నీఫర్ డీ పోవోలా వెల్లడించారు. ఫిన్‌లాండ్ ప్రజలు ప్రకృతితో దగ్గరి సంబంధం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యపరమైన పని విధానం కూడా ఉంటుందని చెప్పారు. ఇది జీవితంలో సంతృప్తిగా ఉండడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవంతమైన జీవితం ఎలా కొనసాగించాలి, అనేదానిపై ఫిన్‌లాండ్ ప్రజలకు మెరుగైన అవగాహన ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసం, స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. ఉచిత విద్య, వైద్యం తక్కువ అవినీతి కూడా ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణాలని వెల్లడించారు.
భారత్ అన్‌హ్యాపీ అందుకే..
ఇక భారత్ హ్యాపీనెస్ జాబితాలో 126 స్థానంలో నిలిచింది. దేశంలో నిరుద్యోగం, పేదలకు సరైన ఉపాధి లేకపోవడం, జీవన వ్యయం పెంపు, ఖరీదైన వైద్యం, వ్యాపారంగా మారిన విద్య, స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి తక్కువగా ఉండడం, పాలకుల అవినీతి, అధికారుల లంచాలు ఇలా అనేక కారణాలు భారత్ సంతోషంలో వెనుకబడడానికి కారణాలుగా పలువురు పేర్కొంటున్నారు.
టాప్ 20 హ్యాపీనెస్ దేశాలు ఇవీ..
1. ఫిన్‌లాండ్
2. డెన్మార్క్
3. ఐస్‌లాండ్
4. స్వీడన్
5. ఇజ్రాయెల్
6. నెదర్లాండ్స్
7. నార్వే
8. లక్సెంబర్గ్
9. స్విట్జర్లాండ్
10. ఆస్ట్రేలియా
11. న్యూజిలాండ్
12. కోస్టారికా
13. కువైట్
14. ఆస్ట్రియా
15. కెనడా
16. బెల్జియం
17. ఐర్లాండ్
18. చెకియా
19. లిథువేనియా
20. బ్రిటన్
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: World happiness report why are indians not happy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com