Bengaluru Woman: సరిగ్గా మూడు నెలల క్రితం ఆమెకు పెళ్లయింది. అందరి అమ్మాయిల మాదిరిగానే ఆమె కూడా తన వైవాహిక జీవితం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్తతో కలిసి ఉండాలని.. అతనితో సరదాగా గడపాలని.. అతడి సాంగత్యంలో మైమరచిపోవాలని ఎన్నో కలలు కన్నది. అయితే ఆమె కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఆశలు అడియాసలయ్యాయి. ఇక తట్టుకోలేక ఆమె బయటకు వచ్చేసింది. తన భర్త కు సంబంధించిన అసలు విషయాన్ని బయటకు చెప్పింది.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని గోవిందరాజు నగర్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, అబ్బాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వారు సప్తగిరి ప్యాలెస్ ప్రాంతంలో కాపురం మొదలుపెట్టారు. వివాహం జరిగిన నాటి నుంచి తన భర్త దగ్గరికి రావడం లేదని.. సంసారం చేయడం లేదని ఆ యువతి ఆరోపించింది. అంతేకాదు, తన జీవితం ఇలా అయింది కాబట్టి డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది.. చివరికి వేధింపులకు కూడా పాల్పడింది. ఏకంగా రెండు కోట్ల పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. భార్య తనపై లేనిపోని నిందలు వేసి.. తనను తేడా గాడు అని అభాసు పాలు చేస్తోందని భావించిన ఆ భర్త.. ఏకంగా పోలీసులను ఆశ్రయించాడు.
తన భార్య అంతకుముందు ఒత్తిడి తీసుకురావడంతో అతడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అందులో అన్ని సవ్యంగానే ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరిగి ఉంటుందేమోనని వైద్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ భార్య మాత్రం తన భర్త పై విపరీతమైన అపనమ్మకాన్ని పెంచుకుంది. అతడు సంసారం చేయడంలో విఫలమవుతున్నాడని ఆరోపించింది. ఇక గడిచిన నెల 17వ తేదీన ఆ యువతి తరఫు బంధువులు ఆ యువకుడి మీద తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా ఆమెపై, పందులపై కేసు నమోదు చేశారు. సదరు యువతి బిజెపి ఐటి విభాగంలో పనిచేస్తోందని.. ఆమె నుంచి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు అతడు విన్నవించాడు.