Sai Dharam Tej OG: పవన్ కళ్యాణ్ పేరు వింటేనే కొందరి బాడీలో వైబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆయన నుంచి సరైన సక్సెస్ వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ మరోసారి ‘ఓజీ’ సినిమాతో వస్తున్నాడు అంటే ఆ సినిమా అభిమానులకు ఎంత స్పెషాలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ తో ఎక్కడలేని హైప్ అయితే క్రియేట్ అయింది. నిన్న రాత్రి ప్రీమియర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమాను చూసి అభిమానులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద అభిమానులు ఉన్నప్పటికీ ఆయన ఇంట్లో ఉన్న తన మేనల్లుడు అయిన సాయి దుర్గ తేజ్ ను మించిన డై హార్ట్ ఫ్యాన్ అయితే మరొకరు ఉండరు అనేది వాస్తవం… తేజు తన చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ని చూస్తూ పెరిగాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగా హీరో అవ్వాలనుకున్నాడు. అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళ మామ సినిమా చూస్తున్నప్పుడు తేజూ నిజంగా చిన్నపిల్లడవుతాడు…
నిన్న అభిమానులతో కలిసి ఓజి ప్రీమియర్ షో చూసిన సాయి దుర్గ తేజ్ విపరీతంగా ఎంజాయ్ చేశాడు…ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు అరుస్తూ, ఈలలు వేస్తూ గోలలు చేస్తు, డాన్సులు చేస్తూ సినిమా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేలా చేశాడు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కి ఓజీ సినిమాలో మంచి ఎలివేషన్స్ పడ్డాయి. ఈ దెబ్బతో తన అభిమానుల ఆకలి తీరిపోయింది అనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఫీలింగ్ ను అర్థం చేసుకున్న సుజీత్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపిస్తూనే,అతని నుంచి ఒక పవర్ ఫుల్ సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసి చూపించాడు.
ఇక సుజీత్ ఇచ్చిన ఎలివేషన్స్ ఎంతలా వర్కౌట్ అయ్యాయంటే సాయి దుర్గ తేజ్ లాంటి హీరో సైతం తను ఒక నటుడిని అనే విషయం మర్చిపోయి స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతిసారి పేపర్లు విసురుతూ పూనకాలు వచ్చిన వాడిలా ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అంటే నచ్చని వారు ఎవరు ఉంటారు. ఆయన కనిపిస్తే చాలు బట్టలు చించుకొని, స్క్రీన్ ముందు శివతాండవంలా డాన్సులు వేసే అభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారు…
రెండు నెలల క్రితం వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా నిరాశపరిచినప్పటికి ఓజీ సినిమా మాత్రం అభిమానులను అలరించిందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రీమియర్ షో తోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది…లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తోంది అనేది తెలియాల్సి ఉంది…
OGGGGGGGGGGGGGG pic.twitter.com/47Mr1vN8RN
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 24, 2025