
ఏపీలో కరోనా కేసుల సంఖ్య కొనసాగుతూనే ఉంది. తాజాగా 18వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,120 శాంపిల్స్ ను పరీక్షించగా, 18,285 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ తాజా బులిటెన్ లో తెలిపింది. అదే సమయంలో 24,105 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,24,859 కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 99 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో బాధపడుతూ ఇప్పటి వరకూ 10,427 మంది మరణించారు.