Taj Mahal Story: మొఘలు సామ్రాజ్య కాలంలో నిర్మించి.. సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించి.. నేటికీ చెక్కు చెదరని ఇంజినీరింగ్ అద్భుతం తాజ్‌మహల్.. ఆగ్రాలో 42 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన ఈ తాజ్‌మహల్ దూరం నుంచి మెరుస్తుంది. దీని నిర్మిణంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ప్రస్తుతం దీనిని ప్రపంచంలోనే ఏడో అద్భుతంగా పిలుస్తున్నారు. దీనిని కట్టడానికి 20 వేల మంది కార్మికులు 22 ఏళ్లు శ్రమించి నిర్మించారు. ప్రస్తుతం దీని విలువ ఒక బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.75 వేల కోట్లు. తాజ్‌మహల్ నిర్మాణంలో నాటి ఇంజినీర్ల నైపుణ్యాలను నేటి ఇంజినీర్లు కీర్తిస్తున్నారు. తాజ్‌మహల్ మెయిన్ డోర్ నుంచి వెనకవైపు చూస్తే పెద్దగా కనిపిస్తుంది.. దగ్గకు వెళ్లే కొద్ది చిన్నగా మారిపోతుంది. తాజ్‌మహల్‌కు నాలుగు వైపులా ఉన్న స్తంభాలు కొంచె వంగి ఉంటాయి. దగ్గర నుంచి చూస్తే లోపలికి వంగినట్లు.. దూరం నుంచి చూస్తే బయటకు వంగినట్లు ఉంటాయి. వాస్తవంగా అవి బయటకే వంగి ఉన్నాయి. భూకంపాలు వచ్చినప్పుడు స్తంభాలు తాజ్‌మహల్‌పై పడకుండా బటయకు వంగినట్లు నిర్మించారు.
1607లో నిర్మాణానికి బీజం..
స్టీల్, కాంక్రీట్ లేని రోజుల్లోనే తాజ్‌మహల్‌ను అద్భుతంగా నిర్మించారు. 1607లో తాజ్‌మహల్ నిర్మాణం ఆలోచన మొదలైంది. మొఘల్ రాజవంశంలో అందరికంటే చిన్నవాడు షాబుద్దీన్ మహ్మద్ కోరం. ఇతనంటే రాజుకు బాగా ఇష్టం. కొడుకు ప్రతీ పుట్టిన రోజు బంగారం దానం చేసేవాడు రాజు. 15 ఏళ్ల వయసులో ఆగ్రాలోని రాజప్రసాదంలో విందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన కొడుకును తన స్నేహితుడి కూతురు ముంతాజ్‌ను ఇచ్చి వివాహం జరిపించాడు.
యుద్ధ వీరుడిగా..
షాబుద్దీన్ మహ్మద్ కోరం యువరాజుగా 15 ఏళ్లు అనేక యుద్ధాలు చేసి రాజ్యాలను జయిస్తాడు. దీంతో అతని తండ్రి తన కొడుక్కు షాజహాన్ అని బిరుదు ఇచ్చాడు. షాజహాన్ అంటే విశ్వవిజేత.. ప్రపంచానికి రాజు అని అర్థం. షాజహాన్‌కు ఆరుగురు భార్యలు. కానీ ముంతాజ్ అంటేనే షాజహాన్‌కు ఎక్కువ ఇష్టం. ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు.
14వ సంతానం సమయంలో..
1621లో షాజహాన్ తండ్రి చనియాడు. తండ్రి చనిపోయిన 7 ఏళ్ల తర్వాత తాను రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. ఏడాది తర్వాత శత్రువులు దాడిచేశారు. రెండేళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో షాజహాన్ విజయం సాధించాడు. అయితే యుద్ధం జరుగుతుండగానే, 17 జూన్ 1631లో ముంతాజ్ తన 14వ సంతానం సమయంలో అనారోగ్యానికి గురై మరణించింది. దీంతో అతని జీవితం చీకటిమయమైంది. ఎనిమిది రోజులు ఏమీ తినలేదు. రెండేళ్లు అత్తరు వాడలేదు. తన భార్య ముంతాజ్ చివరి కోరిక తన స్మారక చిహ్నం ఒక అందమైన ప్రదేశంలో ఉండాలి.
1632లో నిర్మాణానికి శ్రీకారం..
భార్య కోరిక తీర్చడానికి షాజహాన్ తాజ్‌మహల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం శిల్పులు, ఇంజినీర్లు, నైపుణ్యం ఉన్నవారు మొత్తం కలిపి 20 వేల మంది కార్మికులను ఉపయోగించాడు. యమునా నది తీరంలో నిర్మాణం చేయాలని నిర్ణయించాడు. రాజు ఆజ్ఞ మేరకు ఇంజినీర్లు నైపుణ్యంతో నిర్మాణం ప్రారంభించారు. నదీతీరంలో భూమి మెత్తగా ఉన్నా.. రాళ్లు, మట్టితో కలిపి పటిష్ట నిర్మాణం ప్రారంభించారు.
పూర్వీకుల నుంచి ఐడియాలు..
తాజ్‌మహల్ నిర్మాణం కనీవినీ ఎరగని రీతిలో ఉండేందుకు, తన తాత, తండ్రి, మామ కట్టిన నిర్మాణాల నుంచి ఐడియాలు తీసుకుని కొత్త ఐడియాతో తాజ్‌మహల్‌కు రూపకల్పన చేశాడు. దీనిని నిర్మాణనికి 20 వేల మంది కార్మికులతోపాటు పెద్ద ఎత్తున ఏనుగులను ఉపయోగించారు. ప్రత్యేకంగా కోట్లాది ఇటుకలు తయారు చేయించాడు. ఆరోజుల్లో ఆ పని అంత ఈజీ కాదు. ధనం కూడా భారీగా ఖర్చు చేశాడు. ఖజానా ఖాళీ అవుతున్నా పట్టించుకోలేదు. మరోవైపు చుట్టుపక్కల పండే ఆహారాన్ని మొత్తం శ్రామికుల కోసం తెప్పించాడు. ఇలా భవన నిర్మాణం పూర్తి చేశాడు.
అందంగా తీర్చిదిద్దేందుకు..
ఇక తాజ్‌మహల్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు ఆగ్రాకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్తాన్ నుంచి మక్రానా మార్బుల్స్ తెప్పించాడు. ఇందుకోసం వెయ్యి ఏనుగులను ఉపయోగించాడు. తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయ్యే వరకూ మార్బుల్స్ ఎవరూ కొనకుండా నిషేధం విధించారు. తాజ్‌మహల్‌పై పెద్ద డూమ్ నాటి ఇంజినీర్ల పనితనానికి అద్దం పడుతుంది. కాంక్రీట్, సిమెంట్ ఉపయోగించకుండానే దీనిని నిర్మించారు.
సిమెంటు లేకుండా..
అయితే తాజ్‌మహల్ కోసం తెప్పించిన మార్బుల్స్‌ను ప్రత్యేకంగా చెక్కడం. వాటిని తాజ్‌మహల్ గోడలకు అంటించడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అయినా దానిని చేయించాడు షాజహాన్. మార్బుల్స్ అంటించేందుకు శీరా, లెమన్ జ్యూస్ ఉపయోగించాడు. పరిశోధనల్లో ఇది తేలింది. సిమెంటు లేకుండా ఈ మిశ్రమంతోనే పూర్తిగా పాలరాతితో తాజ్‌మహల్‌ను అందంగా నిర్మించారు. కానీ, అప్పటికే ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం రెనోవేషన్ పనులకు కూడా శీరా, లెమన్ జ్యూస్‌నే వాడుతున్నారు.
రోజుకు నాలుగు రూపాల్లో..
22 ఏళ్ల తర్వాత 1654లో తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయింది. దీనికి షాజహానే తాజ్‌మహల్ అని పేరు పెట్టారు. తాజ్‌మహల్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏమింటంటే రోజులో నాలగుసార్లు తన రూపం మార్చుకుంటుంది. సూర్యోదయ సమయంలో నలుపు ఛాయలో.. అస్తమించే వేళ లైట్ ఎల్లోపింక్ రంగులో కనిపిస్తుంది. మధ్యాహ్నం తెల్లగా, ముత్యంలా మెరుస్తుంది. సన్‌సెట్ టైంలో బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఏటా భార్య చనిపోయిన రోజు షాజహాన్ తాజ్‌మహల్‌కు వచ్చేవాడు. ఈ క్రమంలో షాజహాన్ కొడుకు 1658లో తండ్రిపై తిరుగుబాటు చేశాడు. తండ్రిని జైల్లో పెట్టాడు. కానీ, ఒక సౌకర్యం మాత్రం కల్పించాడు. జైలు కిటికీలో నుంచి ముంతాజ్ సమాధి అయిన తాజ్‌మహల్ కనిపించే ఏర్పాటు చేశాడు. ఇలా జైల్లో ఉండగానే షాజహాన్ 1662లో తన 74 ఏళ్ల వయసులో మరణించాడు. షాజహాన్ శరీరాన్ని కూడా తాజ్‌మహల్‌లోనే సమాధి చేశారు. మొత్తంగా 400 ఏళ్ల తర్వాత కూడా తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నంగా విరాజిల్లుతోంది. ఇందుకు నిర్మాణ శైలిలోని ప్రత్యేకతే నిదర్శనం.