కేసీఆర్ కు మెగాబ్రదర్స్ షాక్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెగా బ్రదర్స్ షాక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కరోనాతో, పవన్ కల్యాన్ దుబ్బాకపై స్పందనతో టీఆర్ ఎస్ నాయకులు రకరకాలుగా చర్చించుకుంటుున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అదే సమయంలో కేసీఆర్ ను కలవడంతో ఇక ఆయన పోటీచేయడని అందరూ భావించారు. ఆ తరువాత కూడా అదే జరిగింది. అయితే పవన్ కల్యాణ్ కేసీఆర్ ను అప్పడప్పడూ కలుస్తూ వస్తున్నారు. దీంతో […]

Written By: NARESH, Updated On : November 11, 2020 11:39 am
Follow us on


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెగా బ్రదర్స్ షాక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కరోనాతో, పవన్ కల్యాన్ దుబ్బాకపై స్పందనతో టీఆర్ ఎస్ నాయకులు రకరకాలుగా చర్చించుకుంటుున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ భావించారు. అదే సమయంలో కేసీఆర్ ను కలవడంతో ఇక ఆయన పోటీచేయడని అందరూ భావించారు. ఆ తరువాత కూడా అదే జరిగింది. అయితే పవన్ కల్యాణ్ కేసీఆర్ ను అప్పడప్పడూ కలుస్తూ వస్తున్నారు. దీంతో తెలంగాణలో పవన్ టీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉంటున్నారని భావిస్తూ వచ్చారు.

Also Read: ‘దుబ్బాక’ఫలితంపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు..

తాజాగా దుబ్బాక ఎన్నికపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ టీబీజేపీ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నిక మొదటి నుంచి నాయకత్వ పటిమతో ఊపు తీసుకొచ్చిందని, యువకులు, పార్టీ నాయకులు బీజేపీలో ఉత్సాహంగా కలిసి పనిచేశారన్నారు. అదే విధంగా రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్ధత ఆయన విజయానికి కారణమయ్యాయన్నారు. దుబ్బాక విజయంలో బీజేపీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు అంటూ పవన్ ప్రకటన విడుదల చేశారు.

 

Also Read: రఘునందన్ పై కేసీఆర్ బ్రహ్మస్త్రం పనిచేయలేదా..?

అయితే దుబ్బాక ఫలితంపై పవన్ స్పందించడంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ కు సుముఖంగా ఉన్న పవన్ ఒక్కసారిగా టీబీజేపీ పై ప్రశంసలు కురిపించడంతో చర్చనీయాంశంగా మారింది.  మరో వైపు పవన్ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అని కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ ను కలిసిన తరువాత కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కేసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థతి వచ్చింది. దీంతో కేసీఆర్ కు  మెగా బ్రదర్స్ చెరోవైపు షాక్ ఇచ్చారని అనుకుంటున్నారు. ఇలా రకరకాల పరిమాణాలకు కారణమవుతున్న దుబ్బాక పోలింగ్.. రాను రాను ఇంకెన్ని మార్పలు తీసుకొస్తుందో..