https://oktelugu.com/

COVID 19, Face Masks: మాస్కులు లేకుండా తిరిగే రోజు వస్తుందా?

COVID 19, Face Masks: కరోనా(Coronavirus) సృష్టించిన కల్లోలం గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. మొదటి, రెండో దశల్లో వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే ప్రమాదం అంచున పరిభ్రమించింది. కరోనా ముందు ఉన్న స్థితి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్లతో కూడా పెను ప్రమాదమే కలుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : August 20, 2021 1:35 pm
    Follow us on

    Face MaskCOVID 19, Face Masks: కరోనా(Coronavirus) సృష్టించిన కల్లోలం గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. మొదటి, రెండో దశల్లో వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే ప్రమాదం అంచున పరిభ్రమించింది. కరోనా ముందు ఉన్న స్థితి వచ్చేందుకు ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్లతో కూడా పెను ప్రమాదమే కలుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు జంకుతున్నారు.

    కొవిడ్ నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషించేవి మాస్కులు(Masks) తప్పనిసరిగా అందరు ధరించాలని చెబుతున్న నేపథ్యంలో వైరస్ ను ఎదుర్కోవడానికి ఇవే ప్రముఖ ఆయుధంగా చెబుతున్నారు. అయితే మాస్కులు లేని జీవితం గురించి అందరు ఆలోచిస్తున్నా అది సాధ్యమేనా అంటే సులువే అని చెబుతున్నారు. మనదేశంలో కూడా థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెబుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరకలు వస్తున్న సందర్భంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

    కొవిడ్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పంపిణీలో వేగం పెంచాలని భావిస్తోంది. రోగనిరోధక శక్తి పెంచుకునే క్రమంలో వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. సామాజిక, రాజీయ కోణాల్లో కరోనా రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలు సైతం సహకరించాల్సిందిగా సూచిస్తోంది.

    పకడ్బందీ ప్రణాళిక ప్రకారం కరోనా సంక్రమణను సున్నాకు తీసుకొచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. గతంలో పోలియో, మశూచి లాంటి వ్యాధులను తుదముట్టించేందుకు ప్రభుత్వం చేపట్టన విధానాలతో అవి తుడిచిపెట్టుకుపోయాయి. అదే విధంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో కరోనా రక్కసిని పారదోలాలని భావిస్తోంది.

    కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజల్లో కూడా చైతన్యం తెచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొవిడ్ సోకకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ వైరస్ సోకితే తదుపరి చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నిర్మూలనకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించాల్సిందేనని ప్రజలను ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.