India Unique Villages : గ్రామాలంటే చుట్టూ పచ్చని పంట పొలాలు, పశువులు, తారు రోడ్లు, శ్రమైక జీవనం.. ప్రకృతితో పెన వేసుకున్న అనుబంధం.. కానీ కొన్ని గ్రామాలు ప్రత్యేకంగా ఉంటాయి. అడుగడుగునా వాటిలోని వైవిధ్యాన్ని మనకు చూపిస్తాయి. ఈ కథనంలో మనం తెలుసుకోబోయే గ్రామాలు కూడా అలాంటివే. వీటి గురించి ఈ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది అంటే వీటి ప్రత్యేకత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సెట్ పాల్
మహారాష్ట్రలోని ఓ కు గ్రామం ఇది. గట్టిగా 200 కుటుంబాలు ఉంటాయి. ఈ గ్రామ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పాములు మనుషులతో స్నేహం చేస్తుంటాయి. వారిని అస్సలు గాయపరచవు. సాధారణంగా పాములు మనుషుల దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఈ పాములు మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. అలాగని ఇవి విషరహితమైనవి కాదు.. నాగుపాము జాతికి చెందినవి. ఈ విశేషాన్ని చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ గ్రామాన్ని ప్రత్యేక జాబితాలో చేర్చింది. ఈ గ్రామాల్లోకి ఎవరైనా వస్తే పాములు ఇండ్లలో ఉండటం చూసి భయపడుతుంటారు. అందుకే ఈ గ్రామానికి బయట వ్యక్తులు ఎవరూ పెద్దగా రారు.

మట్టూరు
మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం తెలుసు కదా. అక్కడ కన్నడ లేదా తులు భాష మాట్లాడుతుంటారు. అవి రెండు కూడా మన తెలుగుతో దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. కన్నడ లిపిని చూస్తే మన తెలుగు లాగానే పోలి ఉంటుంది. అలాంటి కర్ణాటకలో మట్టూరు అనే ఓ గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 100కు పైచిలుకు కుటుంబాలు ఉంటాయి. ఇక్కడి గ్రామస్తులు మొత్తం సంస్కృతంలో మాట్లాడుతుంటారు. సంస్కృతంలోనే రాస్తుంటారు. వారి విద్యా విధానం కూడా అదే భాషలో కొనసాగుతోంది. దేశంలో సంస్కృతాన్ని మాట్లాడటం ఈ ఒక గ్రామంలోనే కొనసాగుతోంది. ఈ ప్రత్యేకతను చూసే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ గ్రామాన్ని విశిష్టమైన జాబితాలో చేర్చింది.

హివారే బజార్
మహారాష్ట్రలోని ఓ కు గ్రామం ఇది. ఈ గ్రామంలో దాదాపు 60 మంది మిలియనీర్లే. అలాగని వీరు ఏదో వ్యాపారం చేస్తున్నారు అనుకుంటే పొరబాటే. వీరంతా కూడా వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ గ్రామంలో సరాసరి వర్షపాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. కురిసే ఆ తక్కువ వర్షాన్ని ఒడిసిపట్టి కూరగాయ పంటలు సాగు చేస్తుంటారు. ఆ పంటల ద్వారా వీరు మిలియనీర్లు అయ్యారు. ఇటీవల దేశంలో టమాటా ధర పెరిగిన నేపథ్యంలో ఇక్కడి రైతులు భారీగా లాభాలను కళ్ళజూశారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసే ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామంలో రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తుంటారు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ గ్రామాన్ని ప్రత్యేక జాబితాలో చేర్చింది.

జతింగ
ఇందాకా మనం చెప్పుకున్న గ్రామాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ గ్రామం మరొక ఎత్తు. అస్సాం రాష్ట్రంలోని ఓ కుగ్రామం ఇది. ఇక్కడ ప్రతిఏటా పక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతాయి. అవి కూడా వేల సంఖ్యలో. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో పక్షులు వాటంతట అవే కన్నుమూస్తాయి. దీనికి కారణం ఏమిటో ఇంతవరకూ తెలియ రాలేదు. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసినప్పటికీ వాటి మృతి వెనక మిస్టరీ ఇంతవరకు వీడిపోలేదు. అందుకే ఈ ప్రాంతాన్ని డెత్ వ్యాలీ లేదా మృత్యు కుహురమని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తించింది.
View this post on Instagram