Samantha: విజయ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర మేకర్స్. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఖుషి మ్యూజికల్ నైట్ నిర్వహించగా ఈ వేదికలో ఒక సాంగ్ పర్ఫామెన్స్ అప్పుడు మాత్రం సమంత ఎమోషనల్ అయింది.
ఆగస్టు 15న ఈ ఖుషి మ్యూజిక్ కన్సెర్ట్ హైదరాబాద్ నోవాటెల్‌లో నిర్వహించగా.. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, సమంత స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక సింగర్ స్టేజి పైన మజిలీ సినిమాలోని ‘ప్రియతమా ప్రియతమా’ సాంగ్ ని పాడి వినిపించారు. అయితే ఈ సాంగ్ అప్పుడు సమంత ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా…’ లిరిక్స్ వస్తున్నప్పుడు సమంత చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం తన కళ్ళల్లో చాలా క్లియర్ గా కనిపించింది.
ఖుషి సినిమా దర్శకుడు శివ నిర్వాణ గతంలో సమంత తో మజిలీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత సరసన తన మాజీ భర్త నాగచైతన్య హీరోగా చేశారు. ఈ చిత్రం నాగచైతన్య సమంత పెళ్లి అయిన కొత్తల్లో విడుదలైంది. ఇక అప్పట్లో సమంత ఈ చిత్రం తనకు ఎంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చేది. అంతేకాదు మజిలీ సినిమాలో నాగచైతన్య, సమంత కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మరి నాగచైతన్య గుర్తొచ్చో, లేదా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను నెమరు వేసుకోనో తెలియదు కానీ, మొత్తానికి సమంత మాత్రం ఆ సాంగ్ స్టేజి పైన సింగర్ పాడుతున్నప్పుడు, ఏడ్చేసినంత పని చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరోపక్క ఇదే వేదికపై సమంత కష్టం, ఆరోగ్య పరిస్థితిపై అనేక విశేషాలు తెలియజేశారు విజయ్ దేవరకొండ .సమంత ఓ పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆమె కష్టం మాటల్లో చెప్పలేం. చాలా బాధగా అనిపించింది. అయితే సమంత గురించి ఈ విషయాలు ఇప్పుడు చెప్పకూడదని అనుకున్నాం. కానీ చెప్పాలనిపిస్తుంది అంటూ విజయ్ ఓపెన్ అయ్యారు. సమంత ఎంతో కష్టం భరించింది. తనెప్పుడూ నవ్వుతూ ఉండటం చూడాలి ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం తనకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. తనకు లైట్లు, సౌండ్ ఇదంతా పడవు. వెంటనే తలనొప్పి వస్తుంది. కానీ, మన అందరి కోసం ఇక్కడికి వచ్చింది. ఆమె నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్నారు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.
View this post on Instagram