Vedanta Semiconductor Plant: భారత్ కు అడుగడుగునా పంటిలో రాయిలా, కంటిలో నలుసులా, చెవిలో జోరీగలా , చెప్పులో ముల్లులా ఇబ్బంది పెడుతున్నది. పైగా భారత్ కు సరిహద్దు దేశాల్లో పోర్టులు, రోడ్లు గట్రా నిర్మిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ వేదికల్లో భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. దీంతో ఒళ్ళు మండిన మోడీ.. చైనా దేశానికి చెందిన యాప్ లను నిషేధించారు. ఆన్లైన్ రుణాల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్న ఇన్స్టంట్ మనీ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. ఇంకా చాలా రకాల ఉత్పత్తులను చైనా నుంచి కొనడం తగ్గించారు. అయినప్పటికీ డోసు సరిపోలేదని భావించి ఈసారి ఏకంగా చైనాకు అత్యంత కీలకమైన ఆర్థిక మూలంపై దెబ్బ కొట్టారు. ఇప్పుడు మోడీ చేసిన పనిని చూసి అమెరికా నుంచి రష్యా దాకా వేనోళ్ల పొగుడుతున్నారు.

ఇంతకీ మోడీ ఏం చేశారంటే
సెమీ కండక్టర్లు.. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే చిప్ లు. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్ల నుంచి స్మార్ట్ ఫోన్లు దాకా అన్నింట్లో ఈ చిప్ లే ప్రధానం. గత దశాబ్దం లో సాంకేతికత బాగా పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అంతకంతకు విస్తరించింది. ఈ క్రమంలో చిప్ ల కు డిమాండ్ ఏర్పడింది. అంతకంటే ముందుగానే ఈ పరిస్థితి వస్తుందని గ్రహించి చైనా చిప్ ల తయారీ యూనిట్లను భారీగా నెలకొల్పింది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు చైనాపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో యాపిల్ లాంటి బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తుల అసెంబ్లింగ్ కాంట్రాక్టు చైనా కంపెనీలకు ఇచ్చాయి. దీంతో ప్రపంచ మార్కెట్లో చైనా గుత్తాధిపత్యం పెరిగింది. విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆ దేశానికి చేరింది. దీంతో చైనా అంతకంతకు ఆర్థికంగా బలపడుతూ వచ్చింది. అలా వచ్చిన విదేశీ నిధులతోనే భారత్ ను ఇబ్బంది పెడుతోంది. ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేకిన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివల్ల కొన్ని బహుళ జాతి సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయి. అయితే కరోనా ప్రబలినప్పుడు చైనాలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు మూతపడ్డాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
ఈసారి సొంత రాష్ట్రం నుంచే
చైనాలో పరిస్థితులు మెరుగుపడకపోవడం, భారత్ లో తయారయ్యే సెమీ కండక్టర్లు దేశీయ అవసరాలకు సరిపోకపోవడంతో.. ప్రధానమంత్రి మోడీ సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పక్కలో బల్లెం లాగా తయారైన చైనాకు బుద్ధి చెప్పాలి. ఈ రెండు విషయాలను పరిగణలోకి తీసుకొని గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ కు శ్రీకారం చుట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత గ్రూప్, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం ఫాక్స్ కాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. అహ్మదాబాద్ జిల్లాలో 1000 ఎకరాల విస్తీర్ణంలో సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్, డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్, సెమీ కండక్టర్ అసెంబ్లీగ్ అండ్ టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నాయి.

ఇందు కోసం 1.54 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నాయి. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో వేదాంత 60%, ఫాక్స్ కాన్ 40 శాతం వాటా కలిగి ఉంటాయి. వచ్చే రెండేళ్లలో ప్లాంట్ లో సెమీ కండక్టర్లు ఉత్పత్తి అవుతాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి కార్ల దాకా.. ఏటీఎం నుంచి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉపకరణల వరకు అన్నింటి తయారీలోనూ ఇప్పుడు సెమీకండక్టర్ చిప్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. గత ఏడాది నాటికి 2.17 లక్షల కోట్లకు భారత సెమీ కండక్టర్ల మార్కెట్ చేరింది. 2026 నాటికి ఇది 5.12 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అయితే ప్రస్తుతం మన కంపెనీలు ఉపయోగించే సెమీ కండక్టర్లలో ఏ ఒక్కటీ దేశీయంగా తయారయింది కాదు. ప్రధానంగా చైనా, దివాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కోవిడ్ సమయంలో ప్రారంభమైన సెమీ కండక్టర్ల కొరత దేశీయ వాహన, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆత్మ నిర్భర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ల కంపెనీలకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందే వాటిల్లో వేదాంత- ఫాక్స్ కాన్ భాగస్వామ్యం ఒకటి. అయితే చైనా తీరుతో విసిగి వేసారి పోయిన తైవాన్ కూడా భారత్ లో సెమీ కండక్టర్లు తయారు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ పరిణామం మింగుడు పడని చైనా తైవాన్ పై చిత్ర విచిత్రమైన విమర్శలు చేస్తోంది.