https://oktelugu.com/

భారత్‌లో జనవరి నుంచే వ్యాక్సినేషన్‌

ఈ ఏడాది ప్రజలతో ట్వంటీ ట్వంటీ ఆడుకుంది కరోనా వైరస్‌. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం సైంటిస్టులు ఎంతగానో శ్రమించారు. ఈ జనవరి నుంచి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే మొదట ఏ టీకాకు అనుమతి లభిస్తుందా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్.. బండి ఉంటేనే ప్రమాదం.. అమ్మేస్తే పోలా..! ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్న ‘కొవిషీల్డ్’ టీకా […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 10:23 am
    Follow us on

    Vaccination in India
    ఈ ఏడాది ప్రజలతో ట్వంటీ ట్వంటీ ఆడుకుంది కరోనా వైరస్‌. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌ కోసం సైంటిస్టులు ఎంతగానో శ్రమించారు. ఈ జనవరి నుంచి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే మొదట ఏ టీకాకు అనుమతి
    లభిస్తుందా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్.. బండి ఉంటేనే ప్రమాదం.. అమ్మేస్తే పోలా..!

    ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా తయారు చేస్తున్న ‘కొవిషీల్డ్’ టీకా వైపే ఎక్కువగా ఔషధ నియంత్ర సంస్థలు మొగ్గు చూపుతుండటంతో.. దానికే తొలి అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దేశీయంగా ఆక్స్‌ఫోర్డ్ టీకాను పూణేకు చెందిన సీరం సంస్థ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సంస్థ టీకా అనుమతులకు కావాల్సిన సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO)కి అందించిందని తెలుస్తోంది.

    యూకేలో ‘కొవిషీల్డ్’ టీకాకు అనుమతులు లభించిన వెంటనే CDSCO కమిటీ నిపుణులు సమావేశమై.. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఈ టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ డేటాను పరిశీలించనున్నారు. వ్యాక్సిన్ భద్రతా, వైరస్ నిరోధకతపై చర్చించి అత్యవసర వినియోగానికి అనుమతించే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా తన వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    అయితే.. భారత్ బయోటెక్ తయారు చేసే ‘కోవాగ్జిన్’కు సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. దీంతో అనుమతి లభించేందుకు మరికొంత సమయం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఫైజర్ సంస్థ కూడా తన టీకా పనితీరుపై నివేదిక అందించాల్సి ఉంది. దీంతో ఇండియాలో అత్యవసర వినియోగానికి ‘కొవిషీల్డ్’కే తొలి అనుమతి లభించనుందని అధికారులు అంటున్నారు. కాగా, సీరం సంస్థ ఇప్పటికే 4 కోట్ల డోసుల టీకాను సిద్ధం చేసింది. ఏదిఏమైనా వైరస్‌తో ఎంతగానో నష్టపోయాం. ఇప్పటికైనా ఏదో ఒక వైరస్‌ ట్రయల్స్‌ సక్సెస్‌ అయి.. తొందరగా వ్యాక్సినేషన్‌ స్టార్ట్‌ చేయాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్