Vijay Deverakonda: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాంటి నటుడు ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి. కారణం ఏదైనా కూడా ఆయన మరోసారి భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… రీసెంట్ గా ఆయన రష్మిక మందానను పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికి వీళ్లిద్దరు ఒక పది రోజుల హనీమూన్ ట్రిప్ తర్వాత ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్లో విజయ్ రష్మిక ఇద్దరు పాల్గొంటున్నారు…
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
ఇక ఇదిలా ఉంటే కొంతమంది హీరోలు వాళ్ళ కెరియర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని కారణాలవల్ల అలాంటి ఇబ్బందులు ఏర్పడితే పర్లేదు. కానీ కావాలనే కొంతమంది దర్శక నిర్మాతలు ఆ హీరోలను తప్పిస్తుంటారు. దీని వల్ల వాళ్ల కెరియర్ కి చాలా వరకు ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాని కూడా చేయాల్సింది. కానీ అర్జున్ రెడ్డి సినిమా క్యారెక్టర్ కి ఆర్ ఎక్స్ 100 సినిమాకి మధ్య చాలా పోలికలు ఉండటంతో విజయ్ మొదట ఆ కథను రిజెక్ట్ చేశాడట. అయినప్పటికి దర్శకుడు అజయ్ భూపతి మరోసారి విజయ్ ని అడిగినప్పుడు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
కానీ ఏమైందో తెలియదు మొత్తానికైతే ఫైనల్ గా విజయ్ ని తప్పించి కార్తికేయ ను హీరోగా పెట్టి సినిమా చేశారు. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ కథ సరిపోదు అని అందువల్లే కార్తికేయ ను పెట్టామంటూ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చారు… ఇక ప్రస్తుతం విజయ్ టైర్ వన్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన టైర్ వన్ హీరోగా మారిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
