https://oktelugu.com/

Madhya Pradesh : గిరిజనుడిపై మూత్రం.. నిందితుడిపైకి బుల్డోజర్.. షాకిచ్చిన ప్రభుత్వం

తరువాత నేరస్థుడిపై బుల్టోజర్ తో చర్యలకు దిగడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికైతే యూపీ సంస్కృతి ఎంపీకి విస్తరించడంతో అక్కడ నేరసంస్కృతికి అలవాటుపడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 6, 2023 4:43 pm
    Follow us on

    Madhya Pradesh : కరుడుగట్టిన నేరస్థులపై ప్రయోగించే బుల్డోజర్ సంస్కృతి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ కు విస్తరించింది. యూపీలో శాంతిభద్రతల పరిరక్షణకుగాను సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టి చర్యలే చేపడుతున్నారు. గ్యాంగ్ స్టర్లను ఏరివేస్తున్నారు. ముఖ్యంగా ఆక్రమణదారులు, సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారి ఆస్తులను బుల్టోజర్లతో ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. చివరకు సొంత పార్టీ శ్రేణులకు నేరాలతో సంబంధమున్నావిడిచిపెట్టడం లేదు. యోగి చర్యలకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయి. తాజాగా ఎంపీలో సైతం ఇటువంటి చర్యలకే దిగారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.

    ఇటీవల గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ చౌహాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. రోజువారి పనులు చేసే గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందని తెలియకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అయ్యింది. కాంగ్రెస్ తో సహా ఇతర విపక్షాలన్నీ స్పందించాయి. ఘటనపై తీవ్రంగా రియాక్టయ్యాయి. ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. దీంతో నేరస్థుడిపై కఠిన చర్యలకు సీఎం చౌహాన్ ఆదేశాలు జారీచేశారు.

    అయితే పోలీసులు రంగంలోకి దిగారు. బోల్డోజర్ తో నేరస్థుడి ఆస్తులన్నీ ధ్వసం చేశారు. దీంతో పోలీస్ చర్యలు ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నాయి. ఈ ఘటనపై ఎంపీ విపక్ష నేత కమల్ నాథ్ తొలుత స్పందించారు. ఇదొక అమానవీయ ఘటన అని.. నియంత్రించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణకు చెందిన నాయకుడు సతీష్ రెడ్డి సైతం స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే కేదారినాథ్ శుక్లా అనుచరుడు కావడం వల్లే ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. అయితే సంబంధిత నేరస్థుడితో తనకు సంబంధం లేదని శుక్లా ప్రకటించడం.. చర్యలకు సీఎం చౌహన్ ఆదేశించడం.. తరువాత నేరస్థుడిపై బుల్టోజర్ తో చర్యలకు దిగడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికైతే యూపీ సంస్కృతి ఎంపీకి విస్తరించడంతో అక్కడ నేరసంస్కృతికి అలవాటుపడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.