Tragedy : మంచి ఉద్యోగం..ఆకర్షణీయమైన జీతం.. ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతి ఎంత పనిచేసింది..

కానీ ఆమె వివాహం కాలేదని.. సమాజంలో తలెత్తుకొని జీవించలేమని భావించింది. అయితే ఇటువంటి భావన చాలా తప్పు. కానీ అవగాహన, సహనం లేక చాలామంది ఇటువంటి నిర్ణయాలకే వస్తున్నారు. కన్నవారి కలలను చిదిమేస్తున్నారు. 

Written By: Dharma, Updated On : July 6, 2023 4:58 pm
Follow us on

Tragedy : ఎటువంటి సమస్యకు అయినా ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అన్వేషిస్తే ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపగలం. కానీ కొందరు చిన్నపాటి సమస్యకే హైరానా పడతారు. ఆందోళనకు గురవుతారు. చివరకు చావే సమస్యకు పరిష్కారమని.. అదే శరణ్యమని భావిస్తారు. మరికొందరు సిల్లీ రీజన్స్ తో బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. హైదరాబాద్ కు చెందిన యువతి ఇదే విధంగా తనువు చాలించింది. తనకు పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. కన్నవారికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

పుప్పాలగూడకు చెందిన శ్రేయారెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఇంట్లో వారు వివాహం చేసేందుకు సిద్ధపడ్డారు. సంబంధాలు సైతం చూస్తున్నారు. పెళ్లి చూపులకు వస్తున్న వారు శ్రేయారెడ్డిని ఇష్టపడడం లేదు. ఇదే విషయం చెబుతుండడంతో ఆమె మనస్తాపానికి గురైంది. తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బందిపడుతున్నారని తరచూ బాధపడుతూ ఉండేది. కుటుంబ సభ్యులు సముదాయిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల మనస్తాపంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సోడియం నైట్రేట్ తాగి ఆత్మహత్య చేసుకుంది.

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం ఘడియలు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కుదరవంటారు. పెద్దలు తరచూ ఈ మాటలు చెబుతుంటారు. కానీ అందులో చాలా వాస్తవముంది. కానీ యుక్త వయసులో ఉన్నవారు పెద్దగా తలకెక్కించుకోరు. పోనీ శ్రేయారెడ్డికి చేతిలో ఉద్యోగం ఉంది. ఆకర్షణీయమైన జీతం వస్తోంది. ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఆమె వివాహం కాలేదని.. సమాజంలో తలెత్తుకొని జీవించలేమని భావించింది. అయితే ఇటువంటి భావన చాలా తప్పు. కానీ అవగాహన, సహనం లేక చాలామంది ఇటువంటి నిర్ణయాలకే వస్తున్నారు. కన్నవారి కలలను చిదిమేస్తున్నారు.