https://oktelugu.com/

అర్నబ్ టీఆర్పీ కోసం అంతపని చేశాడా..?

పబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్.. సీనియర్ జర్నలిస్టు.. అర్ణబ్ గోస్వామి చుట్టూ.. ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల ఆయన వాట్సప్ చాటింగ్ లీకయినప్పటి నుంచి అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్స్..(బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తా.. ముంబయి పోలీసుల ఎదుట సంచనల విషయాలు వెల్లడించారు. చానళ్ల టీఆర్పీలో మార్పులు చేసినందుకు అర్ణబ్ తనకు దాదాపు రూ.40 లక్షలు ఇచ్చినట్లు.. మూడేళ్ల కాలంలో ఆ మొత్తాన్ని తాను తీసుకున్నట్లు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 / 03:33 PM IST
    Follow us on


    పబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్.. సీనియర్ జర్నలిస్టు.. అర్ణబ్ గోస్వామి చుట్టూ.. ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల ఆయన వాట్సప్ చాటింగ్ లీకయినప్పటి నుంచి అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. తాజాగా బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్స్..(బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తా.. ముంబయి పోలీసుల ఎదుట సంచనల విషయాలు వెల్లడించారు. చానళ్ల టీఆర్పీలో మార్పులు చేసినందుకు అర్ణబ్ తనకు దాదాపు రూ.40 లక్షలు ఇచ్చినట్లు.. మూడేళ్ల కాలంలో ఆ మొత్తాన్ని తాను తీసుకున్నట్లు వెల్లడించారు.

    Also Read: యువతకు పీఎం సరికొత్త టాస్క్..

    ఈ మేరకు ముంబయి పోలీసులు లిఖిత పూర్వకమైన స్టేట్ మెంట్ను ఆయన అందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీఆర్పీ స్కాముకు సంబంధించి.. అర్ణబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగానే దాస్ గుప్తాను కూడా పోలుసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో భాగంగానే దాస్ గుప్తా.. అర్ణబ్ తో తనకు జరిగిన వ్యవహారాలను గురించి వివరించినట్లు సమాచారం.

    Also Read: సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్… భారత్ చైనా సైనికుల మధ్య గొడవ.. పలువురికి గాయలు

    తాను పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం.. ‘‘ అర్ణబ్ 2004 నుంచి నాకు బాగా తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేశాం. 2013లో నేను బార్క్ సీఈవో నియామకం అయ్యాను. ఆ తరువాత 2017లో అర్ణభ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించాడు. చానల్ ప్రారంభించకముందే అర్ణబ్ నాతో దాని విషయంలో చాలా సార్లు చర్చించాడు. తన చానల్ రేటింగ్ పెంచడంలో నా సాయాన్ని కోరుతూ..అంతర్లీనంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం అతడికి బాగా తెలుసు. ఇప్పడు.. తనకు సాయం చేస్తే.. భవిష్యత్ లో నాకు కూడా తను సాయం చేస్తానని ప్రకటించారు. దాంతో నా టీం సాయంతో రిపబ్లిక్ టీవీ టీఆర్ పీని అమాంతం పెంచేశాం. దాంతో అనతి కాంలో అర్ణబ్ చానల్ నంబర్ వన్ ర్యాంకుకు వెళ్లింది. 2017 నుంచి 2019 వరకు ఇలాగే టీఆర్ పీని కావాలని మార్పులు చేస్తూ.. రిపబ్లిక్ టీవీకి సాయం చేశానని’ దాస్ గుప్తా.. తను పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంటులో వివరించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్