https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది .. ఆనందంలో ప్యాన్స్ !

నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దసరా సందర్భంగా 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించింది. Also Read: ఓకే రోజు పవన్, మహేష్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 03:17 PM IST
    Follow us on


    నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దసరా సందర్భంగా 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించింది.

    Also Read: ఓకే రోజు పవన్, మహేష్ కొత్త చిత్రాలు !

    కాగా ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఆర్ఆర్ఆర్… అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాకపోవచ్చు. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడంతో నెటిజన్ల ఆనందానికి అవధలు లేకుండా పోతున్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Also Read: విడుదల కాకుండానే మహేష్ సినిమా వరల్డ్ రికార్డ్

    కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ టీజర్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైయి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్‌ ఇండియా మూవీ.


    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags