https://oktelugu.com/

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..?

కరోనా మహమ్మారి విజృంభణ విద్యార్థుల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులపై కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. వైరస్ వ్యాప్తి వల్ల పది, ఇంటర్ సిలబస్ లలో మార్పులు చేయడంతో పాటు పరీక్షలలో ఛాయిస్ పెంచే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. Also Read: నిరుద్యోగులకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 25, 2021 / 03:38 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విజృంభణ విద్యార్థుల కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పది, ఇంటర్ చదువుతున్న విద్యార్థులపై కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది. వైరస్ వ్యాప్తి వల్ల పది, ఇంటర్ సిలబస్ లలో మార్పులు చేయడంతో పాటు పరీక్షలలో ఛాయిస్ పెంచే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు మరో శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

    Also Read: నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్త.. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

    ప్రస్తుతం 70 శాతం సిలబస్ తో ఇంటర్ పరీక్షలు జరగనుండగా 30 శాతం సిలబస్ ను ప్రాజెక్టులు, అసైన్ మెంట్ల రూపంలో బోధించారు. ఇంటర్ సిలబస్ ఏకంగా 30 శాతం తగ్గడంతో ఎంసెట్ పరీక్షలు కూడా ఈ సిలబస్ తోనే జరగనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లికి చెందిన ఒక అధికారి ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు వెల్లడించారు. విద్యార్థులపై భారంపడకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

    Also Read: ఐఎండీలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే..?

    రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లి అధికారులు ఇంటర్ సిలబస్ కాపీ చేరిన తరువాత ప్రభుత్వాన్ని సంప్రదించి ఆ తరువాత ఎంసెట్ సిలబస్ ను ప్రకటించనున్నారు. జూన్ నెల రెండవ వారంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైన తరువాత ఎంసెట్ సిలబస్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    తెలుస్తున్న సమాచారంప్రకారం మే నెల తొలి వారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని సమాచారం. పదో తరగతి పరీక్షలో మొత్తం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.