Ram Mandir: భారతదేశం అంతా రామమయం అయింది. అపురూప ఘట్టమైన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పురోషత్తముడి గురించే చర్చ సాగుతోంది. శ్రీరాముడి పుట్టినిల్లు అయోధ్య అయినందున బాలరాముడు విశేషాల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా బాల రాముడి విద్యాభ్యాసం, ఆయన తిరగిన ప్రదేశాల గురించి కొన్ని విశేషాలు బయటకు వచ్చాయి. రాముడి గురించి చెప్పుకోవాలంటే ముందుగా అయోధ్య గురించి చెప్పుకోవాలి. రామజన్మభూమిగా పేరొందిన ఈ ప్రదేశంలో రాముడు తిరిగిన కొన్ని ప్రదేశాల గురించి మీకోసం..
శ్రీరాముడు త్రేతా యుగానికి చెందిన దేవుడు కావడంతో ఆ యుగానికి సంబంధించింది ప్రతీది విశేషంగానే నిలుస్తుంది. ముఖ్యంగా రాముడి విద్యాభ్యాసం ఉత్తరప్రదేశ్ లోని కుప్తం గంజ్ బ్లాక్ ఏరియాలోని బధాని మిశ్రా గ్రామంలో గురు వశిష్ట ఆశ్రమం ఉంది. ఇందులోనే రాముడు విద్యాభ్యాసం చేశారు. ఈ ఆశ్రమంలోని రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి నివసించారని చెబుతారు. ఈ ప్రాంతంలోని బతుక్ అనే ప్రాంతానికి కొద్ది దూరంలో గురు వశిష్ట ఆశ్రమమైన మిశ్రాకు వెళ్లి ప్రాథమిక విద్యను అభ్యసించారు. అందుకే ఈ ప్రాంతాన్ని బతుక్ పూర్ అని పిలుస్తారు.
ప్రస్తుతం గురు వశిష్ట ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయోధ్య నుంచి ఈ ప్రాంతం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అయోధ్యకు వెళ్లిన వారు ఇక్కడికి కూడా వెళ్లొచ్చు. రాముడిని చూసిన తరువాత బాలరాముడి విద్యాభ్యాసాన్ని సందర్శించాలంటే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. రాముడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కవే. కానీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బాల్య విశేషాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.