IPL 2024: ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే అత్యంత క్రేజ్ ని సంపాదించుకున్న లీగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపిఎల్ అనే చెప్పాలి. ఐపిఎల్ లో ఆడటానికి ప్రతి ప్లేయర్ కూడా మంచి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటాడు.ఇక ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 17 వ సీజన్ కి సంబందించిన చర్చ నడుస్తుంది.
ఇక ఈ ఇయర్ ఎన్నికలు ఉండటంతో ఐపిఎల్ ఎప్పుడు నిర్వహిస్తారు అనే టాక్ అయితే నడుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మార్చ్ 22 వ తేదీ నుంచి మే 26 వ తేదీ వరకు ఐపిఎల్ ను నిర్వహించాలని బిసిసిఐ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
అయితే ఇండియా లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ ఎక్కడ నిర్వహిస్తారు అనే ఆలోచన కూడా అందరి మదిలో మెదులుతుంది.ఇక బీసీసీఐ మాత్రం ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక జూన్ 1వ తేదీన టి20 వరల్డ్ కప్ ఉండడంతో మే 26వ తేదీ న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగినటైతే జూన్ రెండవ తేదీ న వెస్టిండీస్, జూన్ 3న శ్రీలంక సౌతాఫ్రికా, జూన్ 4వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. కాబట్టి ఈ దేశాల ప్లేయర్లకు ఎక్కువ రోజులు విశ్రాంతి కావాలి అని ఆ దేశాల బోర్డ్ లు అనుకుంటే మాత్రం ఈ దేశాలకు చెందిన ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ లు ఆడే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
అయితే దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళికను బీసిసిఐ ఇప్పటికే ఆయా దేశాల బోర్డ్ తో చర్చించిస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉంటారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. అలాగే ఒకవేళ ఎన్నికల కారణంగా ఐపీఎల్ కనక లేటు అయినట్లయితే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని మీద కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఎన్నికల వల్ల లేట్ అయినట్లయితే ప్రత్యామ్నాయంగా దుబాయిలో కొన్ని మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది.అయితే శ్రీలంక కూడా తమ దేశంలో ఐపిఎల్ కి ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ గా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు కూడా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు బెంగళూరు, ఢిల్లీ వేదికలుగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి… చూడాలి మరి ఐపిఎల్ ని ఎక్కడ నిర్వహిస్తారు అనేది…