https://oktelugu.com/

తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ, ఎన్సీబీ అధికారులు ఎంట్రీతో ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ఈ కేసులో రోజుకో ట్వీస్టు వెలుగుచూస్తోంది. ఇక శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులోనూ పలు చీకటి కోణాలు బయటికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. Also Read: బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 01:53 PM IST

    drug

    Follow us on

    నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ఇండస్ట్రీ మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీబీఐ, ఎన్సీబీ అధికారులు ఎంట్రీతో ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా ఈ కేసులో రోజుకో ట్వీస్టు వెలుగుచూస్తోంది. ఇక శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులోనూ పలు చీకటి కోణాలు బయటికి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

    Also Read: బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు

    డ్రగ్స్ లింకులు శాండల్ వుడ్ పరిశ్రమలోనూ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి పలు కీలక విషయాలను రాబట్టారు. శాండిల్ వుడ్ తారలు రాగిణి ద్వివేది.. సంజనాలకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వారిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం వీరిద్దరి అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీరి నుంచి సీసీబీ పోలీసులు కీలక సమాచారం సేకరించారు.

    వీరి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్ లో సెక్స్ రాకెట్ గుట్టు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. వీరి ఫోన్లలో నగ్న వీడియోలు.. ఫొటోలు ఉన్నట్లు సీసీబీ అధికారుల సమాచారం అందిందట. దీంతో డ్రగ్స్ కేసులో మరో ట్వీస్ట్ వెలుగు చూసింది. సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. వీరిద్దరి ఫోన్లలో ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఉందని.. డ్రగ్స్‌ కేసు బయటపడగానే ఈ గ్రూప్ డిలీట్ చేసినట్లు సమాచారం  బయటపడగానే ఆ గ్రూపును డిలిట్‌ చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

    Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

    ఇప్పటికే కేసులో వెలుగుచూసిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కెంగేరికి చెందిన ఒకరిని.. నైజీరియాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి మంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిద్దరు ముంబై, గోవాల నుంచి డ్రగ్స్‌ను తెచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లు సీసీబీ విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ కేసుతో ఇప్పటికే శాండిల్ వుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోండగా తాజాగా సెక్స్ రాకెట్ బయట పడుతుండటం ఆందోళన రేపుతోంది. తెరవెనుక చీకటి బాగోతాలు మరిన్ని బయట పడనుండటంతో సెలబ్రెటీల్లో టెన్షన్ నెలకొంది.