UPI Payment Charged: ఇండియాలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ డిజిటల్లోకి మారుతోంది. ఈ క్రమంలో డిజిటల్ పేమెంట్స్ కూడా పెరుగుతున్నాయి. గతంలో అమెరికా, జపాన్, రష్యా లాంటి దేశాలకే పరిమితమైన డిజిటల్ పేమెంట్స్ ఐదేళ్లుగా ఇండియాలోనూ ఊపందుకున్నాయి.

నోట్ల రద్దుతో మొదలు..
నోట్ల రద్దుతో భారత్‌లో డిజిటల్ ట్రెండ్ మొదలైంది. కరోనా వైరస్ ఎంట్రీతో డిజిటల్ పేమెంట్స్ మరింత పెరిగాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో నగదు మార్పిడి తగ్గింది. ప్రజలు యూపీఐ లావాదేవీలవైపు మొగ్గు చూపారు. డిజిటల్ లావాదేవీలు సులభంగా ఉండడంతో ఇదేదో బాగుందనుకుని అప్పటి నుంచి నగదు లావాదేవీల కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లను తెగ వాడుతున్నారు. ఎంతలా అంటే చిన్న షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు మొత్తం యూపీఐ ద్వారానే జరగుతున్నాయి.
షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..
యూపీఐల ద్వారా ఫ్రీగా లావాదేవీలకు అలవాటు పడిపోయిన వారికి కేంద్రం గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇకపై యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరింది. సాధారణంగా క్రెడిట్ కార్డు వాడితే ఎండీఆర్ చార్జీలు వేస్తారు. దీన్ని బ్యాంకులతోపాటు కార్డు జారీ కంపెనీలు పంచుకుంటాయి.
సమర్థవంతమైన సేవల పేరుతో..
యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడం ద్వారా సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్‌బీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే యూపీఐ యాప్‌లను వినియోగించే వారికి పెద్ద షాక్ తగలనుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాంగా యూపీఐ పేరు సంపాదించింది. నగదు బదిలీలతోపాటు వ్యాపార చెల్లింపులు కలిపి ప్రతి నెలా రూ.6 బిలియన్ల లావాదేవీల నుంచి రూ 10 ట్రిలియన్ల వరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

మొదట ఉచితం.. తర్వాత బాదుడు..
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత డిజిటల్ సేవలు విస్తృతమయ్యాయి. ముఖ్యంగా 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇవి వేగవంతమయ్యాయి. రిలయన్స్ జియో 4జీ సేవలతో టెక్నాలజీ రంగంలోకి అడుగు పెట్టింది. టెలికం రగంలో మొదట ఉచితంగా కస్టమర్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో అప్పటి వరకు ఈ రగంలో ఉన్న భారతీయ టెలికం సంస్థలకు గట్టి షాక్ తలిగింది. కేవలం ఏడాదిలోనే ప్రముఖ టెలికం కంపెనీలు దివాలా తీసేలా చేసింది జియో. తర్వాత స్వల్పంగా చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ రేట్లు ఇతర టెలికం పంపెనీలకంటే తక్కువగానే ఉండడంతో కస్టమర్లు జియోనే ఎక్కువగా వినియోగించారు. మూడేళ్లు తిరిగాక.. బాదుడు మొదలు పెట్టింది. ఇప్పుడు యూపీఐలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయి. మొదట డిజిటల్ పేమెంట్స్ ఉచితం అని ప్రకటించాయి. తర్వాత కొన్ని సర్వీస్‌లకు చార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టాయి. ప్రీగా నగదు లావాదేవీలు జరుగుతుండడంతో యూపీఐల వాడకం భారీగా పెరిగింది. తాజాగా కేంద్రం ఈ సేవలకు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. వినియోగం పెరిగే వరకూ ఉచితంగా సేవలు ఇచ్చి.. వినియోగం గరిష్ట స్థాయికి చేరుకోఆనే చార్జీల పేరుతో వాయింపు మొదలు పెడుతోంది.
Also Read: Polygamy Legal in Eritrea: ప్రతీ మగాడు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవాలట.. త్వరపడండి