Health Benefits of kitchen Spices: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మనకు శ్రీరామరక్షగా నిలవాలో లేక నష్టం చేయాలో సూచిస్తుంది. ప్రతి రోజు తీసుకునే ఆహారంతోనే మన భవిష్యత్ ముడిపడి ఉంటుంది. మన వంటింట్లోనే ఉండే దినుసుల్లోనే మన ఆరోగ్యం దాగి ఉందని ఎంత మందికి తెలుసు. మన వంట గదిలో ఉండే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, జాజికాయ, మరాఠి మొగ్గ వంటి వాటిలోనే మన ఆరోగ్యం ఉందన్న విషయం ఎందరికి తెలుసు. వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా మనం తీసుకునే ఆహారం రక్షణా నిలుస్తుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో సుగంధ ద్రవ్యాల వినియోగంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకుంటే మంచిది.

మన ఆరోగ్యం విషయంలో మిరియాల పాత్ర ఎంతో ఉంది. దగ్గు, జలుబు వంటి వాటికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. కరోనా సమయంలో కూడా మిరియాలు, లవంగాలు, పసుపు, అల్లం వంటి వాటిని కషాయం చేసుకుని తాగి దాని నుంచి రక్షణ పొందిన విషయం తెలిసిందే. పూర్వం రోజుల్లో మిరపకాయలకు బదులు లవంగాలే వాడేవారు. మిరపకాయలు వచ్చాక మిరియాలను మరిచిపోయాం కానీ వాటి పాత్ర మన ఆరోగ్యం విషయంలో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. మిరియాలను విదేశీయులు మన దగ్గర నుంచి కొనుక్కుని వెళ్లేవారు.
మన వంటింట్లో ఉండే మరో సుగంధ ద్రవ్యం దాల్చినచెక్క. ఇది జీర్ణశక్తి, ఆకలిని పెంచుతుంది. బరువును తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, పంటినొప్పి, జ్వరం వంటి వాటికి కూడా మందుగా పనిచేస్తుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. నీళ్లలో మరిగించి రోజు తీసుకుంటే ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. పార్శ్యపు నొప్పి, గొంతు వాపు, రుతుస్రావ సమస్యలను దూరం చేస్తుంది. దీంతో దాల్చిన చెక్కను రోజువారి ఆహారంలో తీసుకుంటే మనకు ఎంతో మేలు కలుగుతుంది.
మన వంటింట్లో ఉండే మరో రకం అనాస పువ్వు లేదా స్టార్ ఫ్లవర్. దీన్ని బిర్యానీ, బగారలో వాడుతారు. కానీ ఇది ఓ ఔషధాల గని అని ఎంతమందికి తెలుసు. దగ్గు, జలుబు, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే థైమోల్, టెర్పినాల్ లు మెడిసిన్ లా పనిచేస్తాయి. నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. అండాశయ సమస్యలను దూరం చేస్తుంది. సబ్బులు, సెంట్లు, టూత్ పేస్టులు, మౌత్ వాష్ క్రీముల్లో అనాస వాడతారని తెలిసిందే.

మరో సుగంధ ద్రవ్యం యాలకులు. వీటిని కూడా అనేక రోగాలకు మందులుగా వాడతారని చెబుతారు. పూర్వం గ్రీకులు, రోమన్లు వీటిని అత్తరుగా వాడేవారు. ఇవి శృంగారంలో ఇబ్బందులను తొలగిస్తాయి. వీర్య కణాల వృద్ధికి కూడా ఇవి దోహదపడతాయి. ఈ విషయం కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో వివరించాడు. ప్రతి రోజు పడుకునే ముందు ఒక యాలుక తింటే హానికర వ్యర్థాలు బయటకు పోతాయి. యాలకుల కషాయంతో దగ్గు తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. వీటిని నూరి గాయాలకు రాస్తే త్వరగా తగ్గుతాయి.
ఇలా మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలే మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి రోజు మన ఆహారంలో వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. చాలా రకాల రోగాలు దూరమవుతాయి. దీంతో మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే వీటిని మనం విరివిగా వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. దీని కోసం శ్రద్ధ తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి.
Also Read:Amit Shah- Chandrababu: రామోజీరావు మాస్టర్ ప్లాన్.. నేడు అమిత్ షా, చంద్రబాబు భేటీ?