Homeఎంటర్టైన్మెంట్Aadarsa Kutumbam Movie: 'ఆదర్శ కుటుంబం' సెన్సార్ టాక్ వచ్చేసింది..ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదట!

Aadarsa Kutumbam Movie: ‘ఆదర్శ కుటుంబం’ సెన్సార్ టాక్ వచ్చేసింది..ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదట!

Aadarsa Kutumbam Movie: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఎప్పుడో అక్టోబర్ 2 న విడుదల కావాల్సిన ఈ సినిమాని , అక్టోబర్ 9 కి వాయిదా వేశారు. అక్టోబర్ 9 ని టార్గెట్ గా చేసుకొని ప్రొమోషన్స్ కూడా భారీ రేంజ్ లో ప్రారంభించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం తో అక్టోబర్ 30 […]

Aadarsa Kutumbam Movie: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఎప్పుడో అక్టోబర్ 2 న విడుదల కావాల్సిన ఈ సినిమాని , అక్టోబర్ 9 కి వాయిదా వేశారు. అక్టోబర్ 9 ని టార్గెట్ గా చేసుకొని ప్రొమోషన్స్ కూడా భారీ రేంజ్ లో ప్రారంభించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం తో అక్టోబర్ 30 కి వాయిదా వేశారు. ప్రొమోషన్స్ చాలా అగ్రెసివ్ గా ప్రారంభించిన మేకర్స్, నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేయించారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ ని జారీ చేశారు. కొన్ని అభ్యంతరకరమైన పదాలతో పాటు , ప్రముఖుల పేర్లు , ఇంటి పేర్లను మ్యూట్ చెయ్యాలని , కొన్ని హింసాత్మక సన్నివేశాల్లోని తీవ్రత బాగా తగ్గించాలని సూచించింది. సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలు ఉంటుందట.

ఇక ఈ చిత్రం గురించి సెన్సార్ సభ్యులు చెప్పిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటేనే ఫ్యామిలీ తో కూర్చొని చూసేలా ఉంటాయి, కానీ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసిన తర్వాత, ఈ చిత్రానికి నిజంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడా?, లేదా యాక్షన్ సన్నివేశాల వరకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడా? అనే సందేహం వ్యక్తం అవుతుందట. త్రివిక్రమ్ మార్క్ ఫన్ , ఎమోషన్స్ , డైలాగ్స్ ఉంటాయి అట , అదే సమయం లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోతాయట. ఓవరాల్ గా అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్ మిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని , చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని చూస్తారని ,ఈమధ్య కాలం లో ఇలాంటి సినిమా రాలేదని అంటున్నారు.

గతం లో వెంకటేష్ హీరో గా నటించిన మల్లీశ్వరి , నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. కాబట్టి ఆడియన్స్ అంచనాలు భారీ గా ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడట త్రివిక్రమ్. ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం తర్వాత ఆయన తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తనని తానూ నిరూపించుకోవడానికి చాలా కసిగా ఈ చిత్రాన్ని తీసినట్టు అనిపిస్తోందని, సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లో తన మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ గా ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం, సెకండ్ హాఫ్ లో రెండు మూడు సన్నివేశాలు , సత్య కామెడీ టైమింగ్ వంటివి ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper