Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: విపత్తుకే సవాల్ చేశారు.. అంతటి నారా లోకేష్ సెల్యూట్ కొట్టారు

Nara Lokesh: విపత్తుకే సవాల్ చేశారు.. అంతటి నారా లోకేష్ సెల్యూట్ కొట్టారు

Nara Lokesh: కళ్ళ ముందు బీభత్సంగా నీటి ప్రవాహం.. విరిగిపడిన చెట్లు.. కూలిపోయిన గోడలు.. నేల కూలిన విద్యుత్ స్తంభాలు.. ఇలా ఎటు చూసినా ప్రళయం.. ప్రకృతి కలిగించిన నష్టం.. ప్రకృతి ముందు ఎవరైనా దిగదుడుపే. కానీ ప్రకృతి కలిగించే నష్టాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడం మాత్రమే మానవ మాత్రులుగా మనుషులు చేసే పని. ఏపీ రాష్ట్రంలో అర్నబ్ సృష్టించిన నష్టం మామూలుగా లేదు. వాస్తవానికి ముందస్తుగానే ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాలు.. […]

Nara Lokesh: కళ్ళ ముందు బీభత్సంగా నీటి ప్రవాహం.. విరిగిపడిన చెట్లు.. కూలిపోయిన గోడలు.. నేల కూలిన విద్యుత్ స్తంభాలు.. ఇలా ఎటు చూసినా ప్రళయం.. ప్రకృతి కలిగించిన నష్టం.. ప్రకృతి ముందు ఎవరైనా దిగదుడుపే. కానీ ప్రకృతి కలిగించే నష్టాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించడం మాత్రమే మానవ మాత్రులుగా మనుషులు చేసే పని.

ఏపీ రాష్ట్రంలో అర్నబ్ సృష్టించిన నష్టం మామూలుగా లేదు. వాస్తవానికి ముందస్తుగానే ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది. ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాలు.. వర్షం అధికంగా కురిసే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల నుంచి.. సురక్షితమైన ప్రాంతాలకు తరలించింది.. ఇక్కడితోనే ఆగిపోలేదు. సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేలకూలిన చెట్లను తొలగించింది. విద్యుత్ స్తంభాలను కొత్తవి ఏర్పాటు చేసింది. సరఫరాను పునరుద్ధరించింది. ఈ క్రతువులో అన్ని శాఖల సిబ్బంది అర్ధరాత్రి అని తేడా లేకుండా పనిచేశారు. ముఖ్యంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారైతే ప్రకృతి విసిరిన సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి.. మూడు పూటలా ఆహారం అందించారు. యుద్ధ ప్రాతిపదికన తాగు నీటి సరఫరా చేపట్టారు.

సిబ్బంది ఈ స్థాయిలో పనిచేసిన తర్వాత.. వారి సేవలను కొనియాడకుంటే అది ప్రభుత్వమే కాదు. ఒకప్పుడు ఏమో గాని.. ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ఉంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వం. అందువల్లే ప్రభుత్వ సిబ్బందిని భుజం తట్టి అభినందించింది. అద్భుతంగా పనిచేస్తున్నారు అంటూ కొనియాడింది. ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వర్షం సమయంలో భారీ వృక్షాలను.. విద్యుత్ స్తంభాలను తొలగించి.. సహాయక చర్యలను చేపట్టిన సిబ్బంది దృశ్యాలను వీడియో రూపంలో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. తుఫాన్ ధాటికి రాకపోకలకు ఆటంకం కలగకుండా కేవలం గంటల వ్యవధిలోనే రోడ్లను సిబ్బంది బాగు చేశారు. విద్యుత్ అందేలా చేశారు.

ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్పందించి.. సిబ్బంది సేవలను కొనియాడారు..”జలప్రళయం నుంచి మన నగరాలు.. పట్టణాలు.. గ్రామాలు వేగంగా కోలుకునేలా చేయడం మామూలు విషయం కాదు. రాత్రి పగలు అని తేడా లేకుండా వేలాదిమంది సిబ్బంది శ్రమించారు. అత్యవసర సమయంలో పనిచేసిన సిబ్బందికి ధన్యవాదాలు.#together againstcycloneArnab.. అంటూ హ్యాష్ ట్యాగ్ తో ప్రశంసించారు. విపత్తు సమయంలో గంటల తరబడి సేవలు నిలిచిపోతుంటాయి. కానీ ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఫలితాలు ఆదే స్థాయిలో కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper