వాట్సాప్ కు భారీ షాక్.. పోటీగా కొత్త యాప్..?

మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ లలో వాట్సాప్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉండటంతో ఎక్కువమంది ఈ యాప్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన అప్ డేట్ పాలసీపై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది యూజర్లు ఈ అప్ డేట్ పాలసీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Also Read: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవాళ్లకు అలర్ట్.. పాటించాల్సిన జాగ్రత్తలివే..? వాట్సాప్ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 12, 2021 5:44 pm
Follow us on


మనం ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్ లలో వాట్సాప్ యాప్ ఒకటనే సంగతి తెలిసిందే. వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉండటంతో ఎక్కువమంది ఈ యాప్ ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన అప్ డేట్ పాలసీపై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది యూజర్లు ఈ అప్ డేట్ పాలసీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవాళ్లకు అలర్ట్.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

వాట్సాప్ యూజర్లు ప్రత్యామ్నాయ యాప్స్ గురించి వెతుకుతున్న తరుణంలో సిగ్నల్ యాప్ నుంచి గట్టిగా సవాల్ ఎదురవుతోంది. సే హెలో టు ప్రైవసీ అనే పాలసీతో వస్తున్న సిగ్నల్ యాప్ ను యూజర్లు భారీ సంఖ్యలో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వాట్సాప్ కు బదులుగా సిగ్నల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించగా దేశంలోనే టాప్ ఫ్రీ యాప్ లలో ఒకటిగా సిగ్నల్ నిలుస్తోంది.

Also Read: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. ఇంటర్నెట్ లేకపోయినా..?

2014 సంవత్సరంలో సిగ్నల్ ఫౌండేషన్ అండ్ సిగ్నల్ మెసేంజర్ ఎల్ఎల్‌సీ సిగ్నల్ యాప్ ను డెవలప్ చేసింది. ప్రస్తుతం బ్రియన్ ఈ సంస్థకు సీఈవోగా ఉన్నారు. లాయర్లు, పరిశోధకులు, జర్నలిస్టులు ఈ యాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలన్‌ మస్క్‌ ట్విట్టర్ వేదికగా సిగ్నల్ యాప్ ను వాడాలని సూచనలు చేశారు. సిగ్నల్ యాప్ లో వాయిస్ అవతలి వాళ్లకు స్పష్టంగా వినిపిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం: జాతీయం

ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ లలో ఈ యాప్ అందుబాటులో ఉండగా మ్యాక్స్, లినక్స్, విండోస్ యూజర్లు ఈ యాప్ ను వినియోగించుకోవచ్చు. డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్, డిసప్పియరింగ్‌ మెసేజ్ ఫీచర్లతో పాటు ఎమోజీల ద్వారా రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది.