Living Relationship : సమాజంలో ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛ ఉంది. ఆయా దేశాలు తమ ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కొన్ని ప్రత్యేక చట్టాలు, ప్రాథమిక హక్కులను రూపొందించాయి. ఇలా స్వేచ్ఛగా ఒక వ్యక్తి కావొచ్చు.. ఇద్దరు వ్యక్తులు కావొచ్చు.. కలిసి ఉండడానికి ఎవరూ అడ్డు చెప్పరు. అయితే ఇక్కడ ఒక స్త్రీ, పురుషుడు కలిసి ఉండడానికి భారత్ లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. దానికి వివాహ చట్టాన్ని రూపొందించి మ్యారేజ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ చట్టాల గురించి తెలియకపోయినా పురాతన కాలం నుంచి మ్యారేజ్ అనే విధానం ద్వారానే ఒక పురుషుడు, స్త్రీ కలిసుండాలనే నిబంధన ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ కొత్త రిలేషన్ షిప్స్ పుట్టుకొస్తున్నాయి. భారత్ లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న రిలేషన్ షిప్ ‘సహజీవనం’(Living Relationship).
పెళ్లి కాకుండా ఒక యువతి, యువకుడు లేదా… భర్త జరిగిపోయిన స్త్రీ, మరో పురుషుడు లేదా.. భార్య లేని పురుషుడు, మరో స్త్రీతో కలిసి ఉండడానికి ఇక్కడ సహజీవనంగా పేర్కొంటున్నారు. మొదట్లో ఐరోపా, స్కాండినేవియన్ దేశాల్లో ఈ ధోరణి ప్రారంభమైంది. గతంలో పెళ్లయి భర్తను కోల్పోయిన, లేదా భార్యను కోల్పోయిన భర్తలు ఇతర స్త్రీలతో మాత్రమే సహజీనవం చేసేవారు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందు యువతీ యువకులు కలిసి జీవిస్తున్నారు. మరికొందరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసుండాలనే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు.
భారత్ లో సహజీవనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛా హక్కు ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా కలిసుంటే తప్పేంటి? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. ఇక్కడున్న వివాహ చట్టం ప్రకారం అది భారత సంస్కృతి కాదని అంటున్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో పర్యటించిన ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ వివాహానికి ముందే కలిసి జీవిస్తే పరస్పరం అర్థం చేసుకుంటారనడంలో అర్థం లేదని అన్నారు. స్వేచ్ఛ, అభివృద్ధి పేరుతో యువత పక్కదాని పడుతోందని అన్నారు.
భారత్ లో భిన్నమతాల వారు జీవిస్తున్నారు. దాదాపు అన్ని మతాల వారు సహజీవనాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందూ వివాహ చట్టం 1995 ప్రకారం ఇద్దరు వ్యక్తులు (ఆడ, మగ) కలిసి ఉండడానికి వారికి వయసు ప్రకారం సాంప్రదాయబద్ధంగా వివామం చేసుకోవాలి. ఇక వేళ వీరు ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేకపోతే కోర్టుల ద్వారా విడిపోవాలి. అయితే ఒక వ్యక్తి తన భార్యకు ఇష్టం లేకుండా మరో మహిళతో సహజీవనం చేయడాన్ని ఆమె వ్యతిరేకిస్తూ కోర్టును సంప్రదించవచ్చు. మిగతా కొన్ని మతాల్లోని సంప్రదాయం ప్రకారంగానే వివాహం జరిపి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి అవకాశం ఇస్తారు.
అయితే సుప్రీం కోర్టు మాత్రం సహజీవనంపై కొన్ని కేసుల్లో కీలక తీర్పులిచ్చింది. 2022 జూన్ 14న ఇచ్చిన తీర్పు ప్రకారం.. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని తెలిపింది. భార్యభర్తల్లా ఇద్దరూ కలిసి ఉన్నారంటే.. వారు పెళ్లి చేసుకున్నట్లేనని భావించాలని పేర్కొంది. కేరళకు చెందిన ఓ జంట ఇలా దీర్ఘకాలికంగా కలిసి ఉంది. అయితే వారికి ఓ బిడ్డ జన్మించాడు. అయితే కొన్నాళ్లకు భార్య, కుమారుడుని ఆ వ్యక్తి దూరం పెట్టాడు. తమ జీవన భృతి కోసం ఆమె కేరళ కోర్టును సంప్రదించగా.. పురుషుడి ఆస్తిలో వాటా దక్కదని 2009లో తీర్పునిచ్చింది. బాధితురాలు సుప్రీం కోర్టుకెక్కగావారికి అనుకూలమైన తీర్పునిచ్చింది.

ఈ క్రమంలో కొందరు యువతీ, యువకులు సహజీవనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పెళ్లికి ముందు ఇలా కలిసి ఉండడం తాత్కాలికంగా వారికి ఆనందమే ఇచ్చినా.. భవిష్యత్ లో వారికి నష్టాలే ఉంటాయని చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు నిజంగా అర్థం చేసుకొని కలిసి ఉంటే ఎలాంటి సమస్యలు రావు. కానీ పురుషుడు మాత్రం భార్యను విడిచిపెట్టడం గానీ, మరో మహిళతో సంబంధం పెట్టుకున్నా.. భార్యకు ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటే కోర్టును సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ సహజీవనానికి ఎలాంటి ఆధారం ఉండదని పేర్కొంటున్నారు.
ఈ తరుణంలో అసలు సహజీవనాన్ని నిషేధించాలని తాజాగా బీజేపీ ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ తేనెతుట్టె కదిపారు. చాలా మంది సాంప్రదాయవాదులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. కానీ స్వేచ్ఛ ప్రపంచంలో ఇద్దరు కలిసి ఉండడానికి వారికి హక్కు ఉందని వాదిస్తున్నారు. ఇతర దేశాల్లో సహజీవనం చేసి ఎన్నో జంటలో హాయిగా జీవిస్తున్నాయని అంటున్నారు. అయితే మన దేశంలో ఉన్న పరిస్థితులు, ఆచారాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ఈ విధానం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది అనుమానమేనని మరికొందరు పేర్కొంటున్నారు.