రక్తంలో ఆ ఇన్ఫెక్షన్లు ఉన్నాయా… తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్..?

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురు కరోనా బారిన పడ్డారు. బ్రిటన్ నుంచి మొత్తం 1200 మంది రాష్ట్రానికి రాగా వారిలో 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని సైతం క్వారంటైన్ కు తరలిస్తున్నారు. Also Read: ఆ చికిత్సతో గుండెపోటుకు చెక్.. వజ్రం సహాయంతో..? మరోవైపు కరోనా […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2020 2:00 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని అనుకునే లోపు కొత్తరకం కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురు కరోనా బారిన పడ్డారు. బ్రిటన్ నుంచి మొత్తం 1200 మంది రాష్ట్రానికి రాగా వారిలో 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని సైతం క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

Also Read: ఆ చికిత్సతో గుండెపోటుకు చెక్.. వజ్రం సహాయంతో..?

మరోవైపు కరోనా మహమ్మారి గురించి అధ్యయనం చేసి రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారని తేల్చారు. రట్జర్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లతో బాధ పడ్డ వారికే ఎక్కువగా కరోనా సోకినట్లు తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 357 మంది రోగులపై పరీక్షలు జరిపి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

Also Read: యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా.. ఆ వ్యాధి వచ్చే ఛాన్స్..?

సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్లే ఎక్కువగా ఐసీయూల్లో చేరుతున్నారని.. ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ వాళ్లే ఎక్కువగా కరోనా బారిన పడి మృతి చెందినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెకండరీ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు కరోనా కొత్తరకం స్ట్రెయిన్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

మరోవైపు ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్లను తీసుకున్నా కొత్తరకం కరోనా బారిన పడమని తెలుస్తోంది. తెలంగాణలో 70 లక్షల నుంచి 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తొలి దశ వ్యాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తరువాత రెండో దశ కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు.