HomeజాతీయంDrought In India: దేశంలో 31% భూభాగంపై తీవ్ర కరువు ప్రభావం.. ఈ రెండు వారాలు...

Drought In India: దేశంలో 31% భూభాగంపై తీవ్ర కరువు ప్రభావం.. ఈ రెండు వారాలు కీలకం!

Drought In India: భారతదేశంలోని దాదాపు 31% భూభాగం కరువును ఎదుర్కొంటోంది. జూలై 27– ఆగస్టు 23 వరకు కురిసిన వర్షాపాతం ఆధారంగా వాతావరణ శాఖ యొక్క ప్రామాణిక అవపాత సూచిక ఎస్‌పీఐ వెల్లడించింది. వ్యవసాయం, పంటల దిగుబడి, నేతలో తేమపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. ఎప్‌పీఐ అనేది వివిధ సమయ ప్రమాణాలలో వాతావరణ కరువును వర్గీకరించడానికి వాతావరణ సూచికలపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నిపుణుల బృందం అభివృద్ధి చేసిన కొలత.

బలహీనంగా రుతుపవనాలు..
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేలవమైన రుతుపవనాలను వివరించడానికి ‘కరువు‘ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘లోపించిన వర్షపాతం‘ అని పెట్టింది. రుతుపవనాలు దాదాపు నెల రోజులుగా బలహీనంగా ఉన్నాయి, ఆగస్టులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. 31% భూభాగంలో, గణనీయమైన 9% తీవ్రంగా పొడిగా ఉంది, అదనంగా 4% విపరీతమైన శుష్కతను అనుభవిస్తున్నట్లు డేటా చూపించింది. దక్షిణాదిలోని పెద్ద ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్‌లోని జిల్లాలు, తూర్పు భారతదేశంలోని కొన్ని విభాగాలు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. వర్షాభావంతో ఈ ప్రాంతాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించింది. డేటా ప్రకారం, భారతదేశంలోని గణనీయమైన 47% ప్రాంతం తేలికపాటి పొడి పరిస్థితులను ఎదుర్కొంటోంది. తేలికపాటి పొడి పరిస్థితులు కూడా నేల తేమ తగ్గడానికి దారితీస్తాయని, ఇది పంట పెరుగుదల మరియు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేస్తుందని నిపుణులు తెలిపారు.

రాబోయే రెండు వారాలు కీలకం..
రాబోయే 2 వారాలు చాలా కీలకం కానున్నాయి. పేలవమైన వర్షాలు కొనసాగితే, అధిక ఒత్తిడి ఉంటుందని ఐఎండీ శాస్త్రవేత్త రాజీబ్‌ ఛటోపాధ్యాయ తెలిపారు. వివిధ రంగాల్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. మరో రెండు వారాల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే, నీటి ఎద్దడి అధికం కావచ్చన్నారు.

2002నాటి పరిస్థితులు..
దేశంలో జూన్‌ 1 నుంచి ఆగస్టు 23 వరకు సీజనల్‌ ఎస్‌పీఐలో కూడా చాలా జిల్లాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రుతుపవనాల విరామం 2002లో కనిపించిన మాదిరిగానే ఉంది. ఇది జూలైలో రుతుపవనంలో 26 రోజుల సుదీర్ఘ విరామం చూసింది. తగినంత నీరు లేకపోవడం వల్ల ప్రభావిత ప్రాంతాల్లోని పంటలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటి లభ్యత, దిగుబడి తగ్గుదల మరియు రైతులకు ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందన్నారు. అవపాతం తగ్గడంతో, సరస్సులు, జలాశయాలు మరియు భూగర్భజలాలు వంటి నీటి వనరులు క్షీణించే అవకాశం ఉందని అంచనా వేశారు. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా మరింత బాష్పీభవనం పెరుగుతుందని తెలిపారు.

సెప్టెంబర్‌పైనే ఆశలు..
సెప్టెంబరులో కొంతవరకైనా వర్షాభావాన్ని పూడ్చగలరా అనేది చూడాలి. భారత రుతుపవనాలు ఎల్‌నినోల మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. ఎల్‌నినో ఈ నెలలో తగినంత బలాన్ని పొందింది, అందువల్ల రుతుపవనాలపై దాని ప్రభావం ఆగస్టులో ఎక్కువగా కనిపించింది. త్వరలో సానుకూల హిందూ మహాసముద్ర ద్విధ్రువ (ఐవోడీ) అభివృద్ధి గురించి నివేదికలు ఉన్నాయి. రుతుపవనాలపై ఈ అభివృద్ధి సంభావ్య ప్రభావం ఇంకా అనిశ్చితంగా ఉంది. అయితే ఇది సానుకూల కారకంగా పని చేయగలదు. ఐవోడీ అనేది హిందూ మహాసముద్రంలో జరిగే సహజ వాతావరణ దృగ్విషయం. ఇది సముద్రపు ఉష్ణోగ్రతపై సీసా ప్రభావం వంటిది. హిందూ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగం తూర్పు భాగం కంటే వెచ్చగా మారినప్పుడు, దానిని ‘పాజిటివ్‌ ఐవోడీ అంటారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular