Photo Story: కొందరు సెలబ్రెటీలు సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో తమ అప్డేట్ ను ఇస్తున్నారు. వారు ఎక్కడున్నా.. ఆ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతా చాలా మంది వారి ఫ్యాన్స్ తమ అభిమాన నటులతో చిట్ చాట్ చేస్తున్నారు.ఇటీవల ఇదే అభిమానంతో వారి చిన్ననాటి ఫొటోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా తెలుగు, తమిళం, మలయాళంలో నటించిన ఓ హీరోయిన్ కు సంబంధించిన చైల్డ్ పిక్ ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగింది.కానీ ఆ వార్తలకు హీరోయిన్ పులిస్టాప్ పెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఆ పాప ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ ఆసిన్. 1985 అక్టోబర్ 26న ఆసిన్ తొట్టుంకల్ కేరళలోని కొచ్చి లో జన్మించింది. తన 15వ ఏటా అంటే 2001లో ‘నరేంద్రన్ మాకెన్ జయకాంతన్ వక’ అనే మలయాళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ఈ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సినిమాలో నటన చూసిన తరువాత తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెను తెలుగు సినిమా ‘అమ్మానాన్న తమిళ అమ్మాయి’ సినిమా కోసం టాలీవుడ్ కు తీసుకొచ్చారు. ఆ తరువాత ‘శివమణి’లో అవకాశం ఇచ్చారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయ్యాక తమిళంలో ఛాన్సెస్ పెరిగాయి.
తమిళంలో సూర్యతో కలిసి ‘గజిని’లోనటించిన తరువాత ఆసిన్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత అదే సూర్యతో పలు సినిమాలు చేసింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసిన ఆసిన్ కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే 2016లో రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. అయితే ఇంతకాలం వీరి విషయం బయటకు రాలేదు. కానీ ఇటీవల వీరు విడాకులు తీసుకుంటున్నారని కొందరు ప్రచారం చేశారు.దీంతో ఆమె ఫ్యాన్ష్ ఆమె గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.
అయితే ఆసిన్ కు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆమెకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎక్కడా కనిపించవు. అయతే ఇటీవల ఆమె విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం సాగినా ఆసిన్ స్పందించలేదు. కానీ ఆమె చిన్న నాటి ఫొటో మాత్రం వైరల్ అవుతోంది. ఇందులో ఎంతో ముద్దుగా ఉన్న ఆసిన్ ను చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.