https://oktelugu.com/

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఇంటి నుంచే డబ్బులు వేసే, తీసే ఛాన్స్..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతోంది. దేశంలో 40 కోట్లకు పైగా ఖాతాదారులను సొంతం చేసుకున్న ఎస్బీఐ ఖాతాదారులు ఇంటి నుంచి డబ్బులు వేసే, తీసే అవకాశాన్ని కల్పిస్తోంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు ఎస్బీఐ మరింత చేరువవుతోంది. ఎస్బీఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కలుగుతున్నాయి. Also Read: ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 3:32 pm
    Follow us on

    SBI Customers
    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతోంది. దేశంలో 40 కోట్లకు పైగా ఖాతాదారులను సొంతం చేసుకున్న ఎస్బీఐ ఖాతాదారులు ఇంటి నుంచి డబ్బులు వేసే, తీసే అవకాశాన్ని కల్పిస్తోంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల ద్వారా కస్టమర్లకు ఎస్బీఐ మరింత చేరువవుతోంది. ఎస్బీఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కలుగుతున్నాయి.

    Also Read: ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.2.67 లక్షలు తగ్గింపు..?

    ఎస్బీఐ అకౌంట్ ఉన్న ఖాతాదారులు 18001037188, 18001213721 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి రిజిష్టర్ చేసుకోవడం ద్వారా డోర్ స్టెప్ సర్వీసులను పొందవచ్చు. రిజిష్టర్ చేసుకోని వారు 1800111103 నంబర్ కు ఫోన్ చేసి ఈ సర్వీసులను పొందవచ్చు. అయితే మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నంబర్ లింకై ఉంటే మాత్రమే ఈ సర్వీసులను పొందడం సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం ఈ సర్వీసులను పొందలేరు.

    వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లు ఎస్బీఐ డోర్ స్టెప్ సర్వీసులను వినియోగించుకోవచ్చు. అయితే బ్యాంకు పని చేసే వేళల్లో మాత్రమే ఖాతాదారులు ఈ సర్వీసులను పొందగలిగే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా సులభంగా డిపాజిట్, విత్ డ్రా సాధ్యమవుతాయి. అయితే ఎస్బీఐ డోర్ స్టెప్ సర్వీసులను ఖాతాదారులు ఉచితంగా పొందలేరు.

    Also Read: బీమా పాలసీలను తీసుకుంటున్నారా.. చేయకూడని తప్పులు ఇవే..?

    ఎస్బీఐ బ్యాంక్ ఉన్న ప్రాంతాన్ని బట్టి సర్వీసుల కోసం 100 రూపాయల లోపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ సర్వీసుల ద్వారా 20,000 రూపాయల వరకు డబ్బులు డిపాజిట్, విత్ డ్రా చేసే ఛాన్స్ తో పాటు క్యాష్ పికప్, ఫామ్ 16, క్యాష్ డెలివరీ, లైఫ్ సర్టిఫికెట్ ఇతర సర్వీసులను పొందవచ్చు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం