Homeఎంటర్టైన్మెంట్రష్మీ - సుధీర్ పర్సనల్ వీడియో లీక్: అక్కడ కూడా రొమాన్స్.. !

రష్మీ – సుధీర్ పర్సనల్ వీడియో లీక్: అక్కడ కూడా రొమాన్స్.. !

Rashmi gautam and sudigali sudheer
బుల్లితెర కార్యక్రమాలను ఫాలో అయ్యేవారిని తెలుగు టీవీ షోల్లో మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే.. ముందుగా చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి టీఆర్పీ రేటింగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ ఇద్దరి క్రేజ్ గురించి. ఛాన్స్ దొరికినప్పుడల్లా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ రొమాంటిక్ యాంగిల్‌ ను చూపిస్తూ ఏదో రకంగా హైలైట్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఒకరికి ఒకరు తరచూ లవ్ ప్రపోజ్ చేసుకోవడం, రొమాంటిక్‌ గా డ్యాన్స్ లు, డబుల్ మీనింగ్ డైలాగులు.. మొత్తానికి వీరి మధ్య సాగే లవ్ ట్రాక్స్ కి ఎండింగ్ అనేది లేకుండా పోయింది.

Also Read:  మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

అందుకే వీళ్లిద్దరూ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉన్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌ను స్పెషల్‌గా ప్లాన్ చేశారు మల్లెమాల వారు. ఇందులో భాగంగానే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్కిట్లను ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎవరెలా ప్రవర్తిస్తుంటారో అనే అంశాలను ఎడిట్ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్‌ పర్సనల్ వీడియోను కూడా ప్లే చేయడం జరిగింది. ముందుగా సుధీర్ రొమాంటిక్‌గా రష్మీకి పూలతో విష్ చేశాడు. ఆ తర్వాత హగ్ చేసుకోమని అడగడం, దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోవడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది.

Also Read: డబుల్ గ్లామర్ డోస్ తో వైట్లకు హిట్ వస్తోందా ?

మొత్తానికి బయట కూడా వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని తేలిపోయింది. ఎలాగూ ఎప్పటినుండో వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అందుకే వీరిద్దర్నీ హీరోహీరోయిన్లుగా పెట్టి ఓ సినిమా తీయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఇద్దరూ దగ్గర ఉండి మరి, ప్రకాష్ అనే నూతన డైరెక్టర్ తో సినిమాని ఫైనల్ చేశారు. త్వరలోనే వీళ్ళు కలసి చేస్తోన్న సినిమా మొదలు కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Extra Jabardasth - 1st January 2021 - Extra Jabardasth Latest Promo - Rashmi - New Year Special 2021

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version