రోహిత్ తో పాటు ఖేల్ రత్నకు ఎంపికైన క్రీడాకారులు వీరే..!

క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న పురస్కారానికి భారత ఓపెనర్, వైస్ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్ మ్మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు. ఖేల్ రత్న పురస్కానికి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించిన సెలక్షన్ కమిటీ జాతీయ అవార్డులకు క్రికెటర్ రోహిత్ శర్మతోపాటు మరో ముగ్గురిని నామినేట్ చేసింది. వీరిలో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా, పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు ఉన్నారు. Also Read: భారత్ వ్యాక్సిన్ […]

Written By: Neelambaram, Updated On : August 19, 2020 3:53 pm
Follow us on


క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న పురస్కారానికి భారత ఓపెనర్, వైస్ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాట్ మ్మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు. ఖేల్ రత్న పురస్కానికి వచ్చిన ధరఖాస్తులను పరిశీలించిన సెలక్షన్ కమిటీ జాతీయ అవార్డులకు క్రికెటర్ రోహిత్ శర్మతోపాటు మరో ముగ్గురిని నామినేట్ చేసింది. వీరిలో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా, పారా ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు ఉన్నారు.

Also Read: భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

రోహిత్ శర్మ గతేడాదిలో క్రికెట్లో అద్భుతంగా రాణించారు. 2019లో రోహిత్ శర్మ వన్డేల్లో 1490 రన్స్ చేయడంతోపాటు ఏడు సెంచరీలు చేశాడు. ఈమేరకు బీసీసీఐ రోహిత్ శర్మను ఖేల్ రత్న అవార్డు కోసం ప్రతిపాదించింది. ఈమేరకు జాతీయ క్రీడా అవార్డుల సెలక్షన్ కమిటీ రోహిత్ రికార్డులను పరిశీలించిన ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ చేసింది.

భారత క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ తర్వాత సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లు భారత్ నుంచి డబుల్ సెంచరీలు చేశారు. ఇక రోహిత్ శర్మ కంటే ముందుగా భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్-1998లో, ఎంఎస్ ధోని-2007లో, విరాట్ కోహ్లీ-2018లో ఖేల్ రత్న పురస్కాలను అందుకున్నారు.

Also Read: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

తాజాగా ఖేల్ రత్నకు నామినేటేడ్ అయిన రోహిత్ శర్మ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకుంటే ఈ అవార్డు దక్కించుకున్న నాల్గోవ క్రికెటర్ గా నిలువనున్నాడు. రోహిత్ శర్మ ఖేల్ రత్నకు నామినేటేడ్ కావడంతో రోహిత్ ఫ్యాన్స్ తోపాటు యావత్ క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.