Qutab Minar: అమెరికాలోని టైం స్క్వేర్, దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లు ప్రసిద్ధ కట్టడాలు అని అందరికీ తెలుసు. కానీ ఇటీవల వీటిని నేటి సాంకేతికతను ఉపయోగించి దీనిపై లేజర్ షో వేస్తున్నారు. వీటిపై ప్రముఖుల చిత్రాలు, అడ్వర్టయిజ్మెంట్లు ప్రసారం చేస్తున్నారు. ఇటీవల ఇండియాలోని ప్రముఖుల చిత్రాలు టైం స్క్వేర్, బుర్జ్ ఖలీఫా లపై షో చేశారు. అయితే ఇప్పుడు ఇండియాలోని కుతుబ్ మినార్ కూడా అదే లెవల్లో కాంతునీనుతోంది. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడాల్లో ఒకటిగా నిలిచిన దీనిపై జూలై 27న లేజర్ షో ను ప్రారంభించారు.కానీ దీనిపై ఇతర దేశాలకు చెందిన ప్రముఖుల చిత్రాలు కనిపించవు. కనీసం అడ్వర్టయిజ్మెంట్లు ప్రసారం కావు.. మరి ఎటువంటి చిత్రాలు ప్రసారం చేయనున్నారో తెలుసా? ఆ వివరాల్లోకి వెళితే..
భారతదేశం ప్రసిద్ధ కట్టడాలకు నిలయం. ఇక్కడ పాలించిన వారు తమ గుర్తులు భవిష్యత్ తరాలకు తెలిసేలా కొన్ని అద్భుత కట్డాలను నిర్మించారు. వాటిలో కుతుబ్ మినార్ ఒకటి. ఇండో-ఇస్లామియా నిర్మాణాలకు ప్రతిరూపకంగా దీనిని 1193లో నిర్మించారు. దీని
ఎత్తు72.5మీటర్లు లేదా 237.8అడుగులు. వెడల్పు 2.75 మీటర్లు. మొత్తం 5 అంతస్తుల నిర్మాణం. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా ఇల్ టుట్ మిష్ పూర్తి చేశాడు. దీని నిర్మాణంలో ఎక్కువగా ఇటుకలను వాడారు. ఈ మినార్ ప్రత్యేకత ఏంటంటే ప్రతీ ఏడాది 22వ తేదీన దీని నీడ భూమ్మీద పడదు.ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్త అక్షాంశం మీద ఉంది. అంతేకాకుండా ఇది 5 డిగ్రీలు వంపునుకలిగి ఉంటుంది.
రూర్కీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)కి చెందిన పూర్వ విద్యార్థి సౌరవ్ బైక్ దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘ట్యాగ్ బిన్’ అనే కంపెనీకి సీఈవోగా ఉన్నారు. కతుబ్ మినార్ ను మరింత ప్రచారం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును ట్యాగ్ బిన్ కు అప్పగించారు. ప్రతి రాత్రి 8.15 నిమిషాలు కాగానే ఓ బెల్ మోగుతుంది. ఆ తరువాత 10 నిమిషాల పాటు దీనిపై భారత సంస్కృతిని తెలిపే కొన్ని చిత్రాలు ప్రదర్శితమై చూపరులను ఆకర్షిస్తున్నాయి. దీనిపై పసుపు, నీలం, నారింజ, ఎరుపు రంగుల్లోకి లేజర్ లైట్ల ద్వారా మారుతుంది.
అయితే దీనిపై టైం స్క్వేర్, బుర్జ్ ఖలీఫా లాగా ఇతరుల చిత్రాలు, అడ్వర్టయిజ్మెంట్లు వేయరు. కేవలం భారతదేశానికి చెందిన సంస్కృతిని తెలిపే చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తారు. అందుకే దీనికి ‘మేరా గావ్ మేరీ ధరోహర్ (MGMD) అని పేరు పెట్టారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శిస్తున్నారు. అజాద్ అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీనిపై 6.5 లక్షల గ్రామాల సంస్కృతిని తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ప్రసారం అయ్యాయి.