Punjab Prisons Begin Conjugal Visits: సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. మనిషిలోనూ నేర ప్రవృత్తి పెరుగుతోంది. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలకు దూరమైన మనిషి మర మనిషిగా మారుతున్నాడు. సర్దుకుపోయే తత్వం తగ్గిపోతోంది. అవసరం కోసం, ఆపద సమయంలో ఎంతకైనా తెగిస్తున్నాడు. దీంతోజీవితాన్ని అగాథంలోకి నెట్టుకుంటున్నారు. క్షణికావేశంలోనో.. ఉద్దేశ పూర్వకంగానో కొందరు తప్పులు చేసి శిక్షలను అనుభవిస్తున్నారు. జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. కుటుంబానికి, బంధువులు, బంధాలకు దూరంగా కారగారాల్లో ప్రాయశ్చిత పడుతూ బతుకును వెళ్లదీస్తున్నారు.

శృంగార సుఖానికి దూరమై మానసిక ఇబ్బందులు..
ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న వేల మంది ఖైదీలు శృంగార సుఖం లేక మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వారిలో మానసిక రుగ్మతలు వస్తున్నాయని జైలు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ నివేదికను అందుకున్న పంజాబ్ ప్రభుత్వం ఖైదీల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
సెక్స్ చేసుకునే అవకాశం..
దేశంలోనే తొలిసారిగా ఖైదీల సెక్స్ కోరికలు తీర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పడక సుఖం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. తన జీవిత భాగస్వామితో మూడు నెలలకోసారి రెండు గంటల పాటు సెక్స్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు జైలులోనే డబుల్ కాట్ బెడ్, అటాచ్డ్ బాత్రూం ఉన్న గదిని కేటాయిస్తున్నారు.
ఆడ, మగ ఖైదీలకూ..
సెక్స్ కోరికలు మగవాడిలో ఎంత ఉంటాయో.. ఆడవాళ్లలోనూ అంతే ఉంటాయన్నది నిపుణుల మాట. జైళ్లలో మగ్గుతున్న వారిలో మానసిక రుగ్మతలు మాత్రం స్త్రీ ఖైదీలకంటే.. పురుష ఖైదీల్లో ఎక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం సెక్స్ చాన్స్.. పురుష ఖైదీలతోపాటు స్త్రీలకు కల్పించాలని నిర్ణయించింది. ఇక్కడ వివక్ష చూపడం సరికాదని భావించి ఇద్దరికీ వర్తింపజేస్తామని తెలిపింది. గదిలో వాళ్లు ఏకాంతంగానైన మాట్లాడుకోవచ్చు లేదా సెక్స్ చేసుకోవచ్చని తెలిపింది.

అందుబాటులో కండోమ్స్
జైల్లో సెక్స్ చేసుకునే ఖైదీలకు జైలు అధికారులు కండోమ్‌లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదులకు మొదటి అవకాశం ఇస్తున్నారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారు గ్యాంగ్‌స్టర్లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం లేదని పంజాబ్ జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17 జైళ్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.