Bigg Boss 6 Telugu Wild Card Entry: ప్రతి ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీసన్ లో ప్రేక్షకులు అమితాసక్తి చూపిస్తూ వచ్చే అంశం వైల్డ్ కార్డు ఎంట్రీ..మొదటి సీసన్ నుండి నాల్గవ సీసన్ వరుకు వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటూ వచ్చింది..కానీ గత సీసన్ లో మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీ లేకపోవడం ప్రేక్షకులను కాస్త నిరాశకి గురి చేసింది..సోషల్ మీడియా లో ప్రతిరోజు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పలానా సెలబ్రిటీ అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు రావడమే కానీ..అది జరగడం లేదు..ఇప్పటికే బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభమై 5 వారాలు పూర్తి అయ్యాయి..21 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 16 మంది ఇంటి సబ్యులకు చేరుకుంది..ఆరు వారాలు పూర్తి కావొస్తున్నా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇంకా జరగలేదు..దీనితో అసలు వైల్డ్ కార్డు ఎంట్రీ ఈ సీసన్ లో ఉంటుందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.

చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ సీసన్ లో వైల్డు కార్డు ఎంట్రీ ద్వారా ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ విష్ణు ప్రియా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..కానీ వైల్డు కార్డు ఎంట్రీ అనేది నిజంగా ఉంటె నాల్గవ వారం లోనే ఉండేది..ఇప్పుడు ఆరవ వారం లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా వైల్డు కార్డు ఎంట్రీ జరగకపోవడం తో ఇక లేనట్టే అని అంటున్నారు విశ్లేషకులు..బిగ్ బాస్ సీసన్ 5 సమయం లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా యాంకర్ వర్షిణి వస్తుంది అంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగాయి..కానీ ఆ వార్తలు సోషల్ మీడియా పుకారు లాగానే మిగిలిపోయింది చివరికి.

ఇది కూడా అంతే అంటున్నారు నెటిజెన్స్..కానీ బిగ్ బాస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుంది..వైల్డ్ కార్డు ఎంట్రీ ఈ వారం ఉండొచ్చేమో చూడాలి..ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ లేకపోతే ఇక ఈ సీసన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ లేనట్టే అని ఫిక్స్ అయిపోవచ్చు.