Bigg Boss 6 Telugu- Geetu: గడిచిన బిగ్ బాస్ సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు పెద్దగా ముఖ పరిచయం లేనోళ్లే ఎక్కువ మంది ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించి హౌస్ లోకి అడుగుపెట్టిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు గీతూ..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే విధంగా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అందరికంటే బాగా అర్థం చేసుకొని కసిగా ఆడుతూ తన గ్రాఫ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళింది..ముక్కుసూటితనం మరియు మనసులో ఏది ఉంటె అది దాచుకోకుండా మాట్లాడడం..బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను అద్భుతంగా ఆడడం వల్ల ఆమెకి క్రేజ్ కూడా బాగా పెరిగింది..కానీ ఇప్పుడు రోజు రోజుకి ఆమె చేస్తున్న కొన్ని చేష్టలు ప్రేక్షకులకు చిరాకు కలిగించేలా చేస్తుంది..గీతూ చేసే కామెడీ మరియు ఆమె మాట్లాడే యాస ప్రతి ఒక్కరికి నవ్వు కలిగిస్తుంది..అందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ ప్రతి విషయంలో కామెడీ చెయ్యాలని చూస్తే చూసేవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది..గీతూ ప్రస్తుత ప్రవర్తన అలాగే ఉంది..ఈ వారం బిగ్ బాస్ పెట్టిన బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ బ్యాటరీ ని ఉపయోగించుకొని హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి..నిన్న చాలా మంది కంటెస్టెంట్స్ ఆ బ్యాటరీ ని ఉపయోగించుకొని ఇంటి సభ్యులతో మాట్లాడారు..వారిలో గీతూ కూడా ఒకరు..40 శాతం వరుకు బ్యాటరీ ని ఉపయోగించుకొని ఆమె తన తండ్రి తో మాట్లాడింది..ఇంటి సభ్యులందరూ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు..కానీ గీతూ లో మాత్రం ఆ ఎమోషనల్ ఫీలింగ్ కనపడడం పక్కన పెడితే అక్కడ కూడా వెక్కిలి చేష్టలు చెయ్యడం ప్రారంబించింది.

ఇది ఆమె తో పాటు ఉన్న ఇంటి సభ్యులతో పాటుగా ఈ షో ని చూసే ప్రేక్షకులకు కూడా చాలా ఇబ్బంది కలిగించింది..ఇలాగే ఆమె ప్రతి విషయం లో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పోతే కచ్చితంగా ఎదో ఒక వారం ఎలిమినేట్ అయిపోతుందని అంటున్నారు నెటిజెన్స్..నిన్న మొన్నటి వరుకు టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతూ వచ్చిన గీతూ గ్రాఫ్ ఇప్పుడు రోజురోజుకి తగ్గిపోతుంది..రాబొయ్యే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందా..లేదా గీతూ తన ఆట తీరుని మార్చబోతుందా అనేది చూడాలి.