PM Modi: మహిళా దినోత్సవం రోజు.. అతివలకు మోడీ శుభవార్త

మహిళా దినోత్సవం రోజున మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. " అతివలు మన దేశానికి గర్వ కారణం. నారిశక్తి మనకు బలం. వారి ధైర్యానికి సెల్యూట్ చేయాలి.

Written By: Suresh, Updated On : March 8, 2024 11:46 am

PM Modi

Follow us on

PM Modi: లింగ సమానత్వం, సమాజంలో గౌరవం, లైంగిక పరమైన హింసకు వ్యతిరేకంగా పోరాటం, అన్ని రంగాల్లో ప్రోత్సాహం.. ఇలా అనేక అంశాలపై చేయాల్సిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ మార్చి 8న అతివలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. త్వరలో ఎన్నికలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అతివలకు శుభవార్త చెప్పారు.. వంట గ్యాస్ (LPG cylinder) ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో సిలిండర్ పై వంద రూపాయలు తగ్గిస్తున్నామని.. దీంతో లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. వంట గ్యాస్ ధర తగ్గించడం వల్ల అతివ(womens) లకు తాము చేయూతనందిస్తున్నామని మోడీ ప్రకటించారు.. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇందులో భాగంగానే సిలిండర్ ధర తగ్గింపు దానికి దోహదం చేస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర 955 గా ఉంది. 100 తగ్గడంతో అది ప్రస్తుతం 855 రూపాయలకు చేరుకుంది.

మోడీ ఏమన్నారంటే

మహిళా దినోత్సవం రోజున మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ” అతివలు మన దేశానికి గర్వ కారణం. నారిశక్తి మనకు బలం. వారి ధైర్యానికి సెల్యూట్ చేయాలి. వివిధ రంగాల్లో వారు అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు. విద్య, వ్యవసాయం, సాంకేతికతరంగాల్లో మహిళలు అనితర సాధ్యమైన వృద్ధిని కొనసాగిస్తున్నారు. వారికి సాధికారత కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టాం. ఆ పనులు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆ ఫలితాలను పొందిన మహిళలు అన్ని రంగాల్లో వృద్ధిని కొనసాగిస్తున్నారని” మోడీ అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ ఒకటి నుంచి వారికి కూడా..

గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించిన కేంద్రం.. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఏప్రిల్ ఒకటి నుంచి పేద మహిళలు ఉపయోగించే సిలిండర్లపై 300 రూపాయల రాయితీ అందిస్తామని వివరించింది.. అలా ప్రకటించిన మరుసటిరోజే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు 100 తగ్గిస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ లో ట్రీట్ చేశారు. సో మొత్తానికి మహిళలకు రెండు రోజుల్లో కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సిలిండర్ పై ధర తగ్గింపు నిర్ణయం ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.