Gaami And Bhimaa: గామి, భీమా చిత్ర విజయాలు చాలా కీలకం… కారణాలు ఇవే!

సంక్రాంతి అనంతరం టైర్ టు హీరోలైన సందీప్ కిషన్, వరుణ్ తేజ్ థియేటర్స్ లో సందడి చేశారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు దక్కలేదు.

Written By: S Reddy, Updated On : March 8, 2024 11:34 am

Gaami And Bhimaa

Follow us on

Gaami And Bhimaa: 2023 టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చింది. చిరంజీవి, బాలకృష్ణ శుభారంభం ఇచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మంచి విజయాలు సాధించాయి. తర్వాత వచ్చిన విరూపాక్ష, దసరా బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించాయి. ఇక బలగం అయితే సంచలన విజయం సాధించింది. బేబీ అంతకు మించిన సంచలనం అని చెప్పాలి. పెట్టుబడికి పదిరెట్లు వసూళ్లు అందుకుంది. డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలు పంచింది. ఏడాది చివర్లో వచ్చిన భగవంత్ కేసరి, హాయ్ నాన్న, సలార్ నిర్మాతలను సంతోష పెట్టాయి.

కాగా 2024 మిశ్రమ పలితాలతో మొదలైంది. సంక్రాంతికి ముందు విడుదలైన చిన్న సినిమాలేవీ ఆడలేదు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేని హనుమాన్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సైంధవ్ డిజాస్టర్ కాగా, గుంటూరు కారం స్వల్ప నష్టాలు మిగిల్చింది. మహేష్ బాబు సంక్రాంతి విన్నర్ కాలేకపోయారు. ఇక నాగార్జున నటించిన నా సామిరంగ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది.

సంక్రాంతి అనంతరం టైర్ టు హీరోలైన సందీప్ కిషన్, వరుణ్ తేజ్ థియేటర్స్ లో సందడి చేశారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు దక్కలేదు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో సమ్మర్ బరిలో నిలిచిన గామి, భీమా చిత్ర విజయాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం పెట్టుకున్నారు.

ఈ రెండు చిత్ర విజయాలతో సమ్మర్ ని గ్రాండ్ గా ప్రారంభించాలని భావిస్తున్నారు. మార్చి 8న విడుదలైన గామి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. వరుసగా మూడు సెలవు దినాలు. అది గామికి కలిసొచ్చే అంశం. విశ్వక్ సేన్ గామి చిత్రంతో క్లీన్ కొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక హిట్ కోసం సతమతం అవుతున్న గోపీచంద్ కూడా భీమాతో మంచి బిజినెస్ చేశాడు. భీమా పై అంచనాలు ఏర్పడ్డాయి. నేడు విడుదలైన భీమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.