PM Modi: ఉగ్రవాదానికి సహకరిస్తుందనే ఆరోపణలతో ఖాతార్ దేశం పై అరబ్ దేశాలన్నీ కక్ష కట్టాయి. ఆ సమయంలో భారత్ ఆ దేశంపై కరుణ చూపింది. కీలకమైన ఆహార ధాన్యాలను ఎగుమతి చేసింది. నిర్మాణ సామగ్రినీ ఎగుమతి చేసింది. తన ఉదార భావాన్ని చాటుకోవడంతో ఖతార్ కోలుకోగలిగింది. అందువల్లే గూడ చర్యం చేస్తున్నారని 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను అరెస్టు చేసి.. ఉరిశిక్ష విధించినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకోవడంతో వారిని అక్కడి కోర్టు విడిచిపెట్టింది. సోమవారం తెల్లవారుజామున వారు ఢిల్లీ చేరుకున్నారు. ఇలా విడుదలైన వారిలో విశాఖపట్నానికి చెందిన నావికాదళ మాజీ ఉద్యోగి కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజులపాటు భారత ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు. అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. మంగళవారం అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ఆహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. ఆహ్లాన్ అంటే స్వాగతం అని అర్థం. కాగా, ఇక్కడ జరిగే ద్వైపాక్షిక చర్చల్లో నరేంద్ర మోడీ కీలకంగా ప్రసంగిస్తారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అబుదాబికి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అబుదాబి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం నుంచి స్వాగతం స్వీకరించిన తర్వాత ఐదు గంటల 30 నిమిషాల వరకు అబుదాబిలో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఓడరేవులకు సంబంధించి సహకారం పై కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నుంచి 9:30 వరకు అహ్లాన్ మోడీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చే ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, దేశ అభివృద్ధికి సహకరించాలని వారిని ఆయన కోరుతారు.. అబుదాబిలో 27 ఎకరాల్లో నిర్మించిన స్వామి నారాయణ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. 108 అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హిందూ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంది. అక్కడ జరిగే వేడుకలకు ఇప్పటికే రెండున్నర వేల ప్రవాస భారతీయులు చేరుకున్నారు. నరేంద్ర మోడీ ముందు ఇచ్చేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టూర్ తర్వాత ఆయన బుధవారం ఖతార్ వెళ్ళిపోతారు. ఖతార్ రాజధాని దోహాలో ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు.. భారత మాజీ నౌకాదళ సిబ్బందిని విడుదల చేసినందుకు ప్రధానమంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతారు. అక్కడ ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో నిర్వహించే ద్వైపాక్షిక సమావేశానికి రెండున్నర వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఖతార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది..