Modi Emotional : ప్రధాని నరేంద్రమోదీ.. భారతీయతను గుండె నిండా.. హిందుత్వాన్ని నిలువెల్లా నింపుకున్న వ్యక్తి. నేషన్ ఫస్ట్ మిగతావన్నీ నెక్స్ అని నమ్మిన నేత. దేశానికి ఎక్కడ అవమానం జరిగినా సహించలేని ప్రధాని.. తాజాగా చంద్రయాన్–3 విజయం మాటల్లో చెప్పలేనంత ఆనందం ఇచ్చింది. 2021లో చంద్రయాన్–2 విఫలం తర్వాత.. ఎంత ఇబ్బంది పడ్డారు.. ప్రపంచ దేశాలు ఎగతాళి చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ నుంచి వచ్చిన ఉద్వేగం తాజాగా బెంగళూరులోని ఇస్రో కంట్రోల్ రూంలో చేసిన ప్రసంగంలో స్పురిస్తుంది. ఈ ప్రసంగం విన్నప్రతీ ఒక్కరికీ ఆ విషయం అర్థమవుతుంది.
దగ్ద్ద స్వరంలో..
భారత అంతరిక్ష యానంలో సరికొత్త చరిత్ర లిఖించింది చంద్రయాన్–3 ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఫీట్ సాధించి తమకు తప్ప ఎవరికీ సాధ్యం కాదని గర్వంతో విర్రవీగుతున్న వేళ.. భారత్ సాధించిన విజయం, దానికి సంబంధించిన ఆనందం, విజయగర్వం ప్రధాని మోదీ మాటల్లో స్పురించింది. మేమూ సాధించామన్న విజయోత్సాహం స్పష్టంగా తెలుస్తుంది. ‘మీ కృషికి సెల్యూట్’ అంటూ అభివాదం చేయడం.. యావత భారత్ సాధించిన విజయంగా అభివర్ణిచడం, ఈ సందర్భంగా ప్రధాని గొంతులో దగ్ద స్వరం ఆయనలోని పట్టలేని ఆనందాన్ని తెలియజేస్తుంది.
ఎక్కడా తనకు క్రెడిట్ ఇచ్చుకోకుండా..
తాజాగా మోదీ ప్రసంగంలో ఎక్కడ కూడా చంద్రయాన్ – 3 విజయం తన క్రెడిట్‌గా చెప్పుకోలేదు. ఆ అవకాశం ఆయనకు ఉంది. తన ప్రోత్సాహం, బీజేపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు, విదేశీ సాయం లేకుండా అందించిన సహకారం అని మోదీ ప్రకటించినా కాదనేవారు ఉండరు. కానీ, మోదీ ఎక్కడా తన స్వార్థం చూసుకోలేదు. కేవలం భారత జాతి సాధించిన విజయంగా అభివర్ణించి తన గొప్పతనం చాటుకున్నారు. యావత్ భారత్ విజయంగా చంద్రయాన్ – 3 సక్సెస్ గురించి తెలిపారు. శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. మీరు లేకుంటే.. ఈ విజయం లేదు అని స్పష్టం చేశారు.