India vs Pakistan : ఆసియా కప్ పోటీలు సమీపిస్తున్న వేళ…. పాకిస్తాన్ దూపుడైన ప్రదర్శనను కనబరిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్లో పాక్ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకలో జరుగుతున్న వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ తో కైవసం చేసుకుని తిరిగి ప్రపంచంలో నెంబర్ వన్ వన్డే జట్టుగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ బాబర్ నేతృత్వంలో పాక్ క్రికెట్ టీం ముందుకు దూసుకు వెళ్తోంది.
ఆస్ట్రేలియా టీం ను అధిగమించి బాబర్ అండ్ కో టాప్ ర్యాంక్ తమ ఖాతాలో వేసుకున్నరు. రేటింగ్ పరంగా తీసుకుంటే పాక్ మరియు ఆస్ట్రేలియా జట్టులు రెండు 118 రేటింగ్ తో సమంగా ఉన్నాయి. అయితే పాయింట్స్ పరంగా చూస్తే మాత్రం ఆస్ట్రేలియా 2714 పాయింట్ల వద్ద ఉండగా పాకిస్తాన్ మాత్రం 2725 పాయింట్లు ముందంజలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
మరోపక్క టీం ఇండియా మాత్రం ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్ లో మూడవ స్థానంలోనే కొనసాగుతోంది. రేటింగ్స్ పరంగా చూసుకున్న ఆస్ట్రేలియా ,పాకిస్తాన్ కంటే కూడా ఐదు పాయింట్ల వెనకంజలో ఉంది.న్యూజిలాండ్
104 రేటింగ్స్ తో నాలుగవ స్థానంలో ఉండగా ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ అయినటువంటి ఇంగ్లాండ్ అయిదవ స్థానానికి పరిమితమైంది. ఇక ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ ,వెస్టిండీస్ మిగిలిన స్థానాలలో ఉన్నాయి.
ప్రస్తుతం కొలంబో వేదికగా జరిగిన మూడవ వన్డే సిరీస్ విషయానికి వస్తే.. 59 పరుగుల తేడాతో పాక్ ఆఫ్గనిస్తాన్ పై తన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో పాక్ మూడు వన్డేల సిరీస్ ను 3–0తో కైవశం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) పరుగులు సాధించి మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
అయితే ప్రస్తుతం పాక్ ప్రదర్శన రాబోయే మ్యాచ్లలో భారత్ కు గట్టి సవాలుగా నిలుస్తుంది ఏమో అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు చూస్తే భారత్ ఓపెనర్ దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ వరకు చాలా సందర్భాలలో తడబడుతుంది. ఇటు పాకిస్తాన్ ప్లేయర్స్ తమ బ్యాటింగ్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లు ముందుకు పోతున్నారు. ఇప్పటికైనా భారత్ సమస్యలను సార్ట్ అవుట్ చేసుకోకపోతే…పరిస్థితి మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఫామ్ చూస్తుంటే.. రాబోయే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు మరింత రోమాంచితంగా ఉంటాయి అని అనిపిస్తుంది.