HomeజాతీయంPM Modi : కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ! వైరల్ వీడియో

PM Modi : కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ! వైరల్ వీడియో

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ కన్నీళ్లు పెట్టుకన్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పీఎం ఆవాస్‌ యోజన – అర్బన్‌ పథకం కింద పేదలకు జనవరి 19న ఇళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోదీ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

చిన్నతనంలో ఇబ్బందిని గుర్తు చేసుకుని..
సభలో మోదీ మాట్లాడుతూ ‘చిన్నతనంలో తనకు ఇలాంటి ఇళ్లు లేకపోయిందన్నారు. ఇలాంటి ఇళ్లు ఉండిఉంటే ఎలా ఉండేవాడినో అని ఆలోచించా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పేద ప్రజలు ఇళ్లులేక ఎంత ఇబ్బంది పడుతున్నారో తనకు తెలుసన్నారు. అందుకే పీఎం ఆవాస్‌ యోజన కింద అన్ని రాష్ట్రాలకు ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ ఇల్లు ఉండాలన్న తన సంకల్పం నెరవేరింది అన్నారు. పేదల కళ్ళలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. శ్రీరాముడి నిజాయితీతో కూడిన పాలన సూత్రాల ఆధారంగానే తమ ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు.

సౌత్‌ ఇండియా పర్యటన..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 19న సౌంత్‌ ఇండియా(మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో) పర్యటించనున్నారు. మూడు రాష్ట్రాల్లోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చేరుకున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన ఎనిమిది అమృత్‌ (అటల్‌ మిషన్‌∙ఫర్‌ రిజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద నిర్మించిన 90 వేలకు పైగా ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. షోలాపూర్‌లోని రాయ్‌నగర్‌ హౌసింగ్‌ సొసైటీకి చెందిన 15 వేల ఇళ్లను అందించారు. ఈ లబ్ధిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, పవర్‌ లూమ్‌ కార్మికులు, ర్యాగ్‌ పికర్స్, బీడీ కార్మికులతో పాటు డ్రైవర్లు ఉన్నారు.

మధ్యాహ్నం కర్ణాటక పర్యటన..
మధ్యాహ్నం మోదీ కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో అమెరికా విమానాల తయారీ కంపెనీ బోయింగ్‌కు చెందిన కొత్త గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. రూ.1,600 కోట్లతో 43 ఎకరాల్లో నిర్మించిన అత్యాధునిక బోయింగ్‌ ఇండియా ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ (బీఐఈటీసీ) క్యాంపస్‌ అమెరికా వెలుపల కంపెనీ చేస్తున్న అతిపెద్ద పెట్టుబడి ఇది. బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలోని ఈ ‘హై–టెక్‌ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్‌ పార్క్‌’ క్యాంపస్‌ ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు.

సాయంత్రం తమిళనాడులో..
ఈ రెండు రాష్ట్రాల పర్యటన అనంతరం మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు చెనై్నలో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ – 2–23 పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాత్రి చెన్నైలోనే బస చేస్తారు. మరో రెండు రోజుల పాటు (జనవరి 20 మరియు 21) ప్రధాని మోదీ తమిళనాడులోనే ఉంటారు. ముఖ్యమైన ఆలయాలను సందర్శించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రామేశ్వరం వెళ్లనున్నారు. రామేశ్వరంలోని శ్రీ ఆరుల్మిగు రామనాథస్వామి ఆలయంలో జరిగే భజనలో పాల్గొంటారు. జనవరి 21న ధనుష్కోటిలోని కోదండరామస్వామి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేస్తారు. రామసేతు నిర్మించిన ప్రదేశంగా చెబుతున్న దనుష్కోటి సమీపంలోని అరిచల్‌ మునైని కూడా మోదీ సందర్శిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular