Poland: పోలండ్.. భారతదేశానికి ఆత్మీయ దేశం. రెండు దేశాల మధ్య ఇప్పటికీ తస్సంబంధాలు ఉన్నాయి. పరస్పర సహకారం కొనసాగుతోంది. అయితే ఈ బంధం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా వస్తోంది. పోలండ్‌కు భారతదేశం అంత ఎందుకు అంత మమకారం? ఏ రకంగా వారిని మనం కాపాడాము? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి దయనీయమైన కథ ఇదీ..
రెండో ప్రపంచ యుద్ధం నుంచి..
పోలండ్‌పై హిట్లర్ రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు… పోలండ్ సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కు సూచించారు. ప్రాణం ఉంటే… బతికితే, బతికినా మళ్లీ కలుద్దాం అని పంపించారు. ఓడ మొదట ఇరాన్‌లోని ఓడరేవుకు చేరుకుంది, ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు. మళ్లీ అలా వెళ్తూ అదాన్‌లో ఆగారు, కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు. చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ రేవుకి వచ్చారు అది గుజరాత్‌లోని జామ్‌నగర్.
ఆశ్రయమిచ్చిన జామ్‌నగర్ రాజు..
ఓడ రేవుకు వచ్చిన విషయం అప్పటి జామ్‌నగర్ రాజు జామ్ సాహబ్ దిగ్విజయ్‌సింగ్‌కు చేరవేశారు తీర ప్రాంత సైనికులు . వెంటనే స్పందించిన రాజు రాజభవనంలో 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాటు చేశారు. పిల్లలను తన రాజ్యంలోని బాలచాడిలోని సైనిక పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు. పూర్తి భద్రతతో శరనార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు. నాటి పోలండ్ పరిస్థితి గమనించి వారికి ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు సైన్యానికి శిక్షణ ఇచ్చి, వారిని సుశిక్షితులైన తయారు చేసి.. తరువాత ఆయుధాలు ఇచ్చి పోలండ్‌కు పంపారు. అక్కడ వారు జామ్‌నగర్ నుంచి వెళ్లిన సైన్యం శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించారు.
శరణార్థి పిల్లల్లో ఒకరు ప్రధాని..
తర్వాత సొంత దేశానికి శరణార్థులు వెళ్లిపోయారు. నేటికీ ప్రతీ సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు. భారత దేశానికి శరణార్థులుగా వచ్చిన వారిలో ఓ బాలుడు తర్వాత పోలాండ్ ప్రధాని అయ్యారు… తమకు ఆశ్రయం కల్పించిన రాజు పేరును పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు మహారాజా జామ్ సాహబ్ పేరు పెట్టారు. పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ప్రతీ సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్ గురించి కథనం ప్రచురించబడుతుంది.
నాటి నుంచి వసుదైక కుటుంబం..
ప్రాచీన కాలం నుంచి భారతదేశం ప్రపంచానికి వసుదైక కుటుంబం.. సహనం అనే పాఠాన్ని బోధిస్తోంది. అందుకే నేటికీ పోలాండ్ ప్రజలు మన జామ్ నగర్ రాజా వారిని.. ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం, జామ్ దిగ్విజయ్ సింగ్ వారికి దేవుడు లాంటివాడు. అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు. భారతదేశంలో దిగ్విజయ్ సింగ్ గారిని అవమానిస్తే, ఇక్కడ లా అండ్ ఆర్డర్‌లో శిక్షించే నిబంధన లేదు. కానీ అదే తప్పు పోలండ్‌లో చేస్తే ఫిరంగి కట్టేసి పేల్చేస్తారు.
ఇప్పటికీ కొన్ని మినహాయింపులు..
– సాహెబ్ దిగ్విజయ్ సింగ్ చేసిన సహాయానికి గుర్తుగా పోలాండ్ ప్రజలు జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జడేజా పేరుతో ఎందుకు ప్రమాణం చేస్తున్నారు.
– ఉక్రెయిన్ నుండి వచ్చే భారత ప్రజలను వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి పోలండ్ అనుమతిస్తుంది.
మన దేశంలో గుర్తింపేది..
భారతదేశ చరిత్ర పుస్తకాలలో దిగ్వాజ్ సింగ్ గురించి ఎప్పుడైనా బోధించారా? పోలాండ్ పౌరుడు ఒక భారతీయుడిని, ‘మీకు జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ తెలుసా?’ అని అడిగితే, ఉక్రెయిన్‌లో డాక్టర్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు సమాధానం చెప్పలేకపోయారు.