Yuge Yuge Bharat: కొత్త పార్లమెంట్ ను మరింత సుందరంగా.. ఆహ్లాదంగా మార్చేందుకు మోడీ నడుం బిగించాడు. అందుకే అందులో అన్ని హంగులు కల్పిస్తున్నాడు. ‘యుగ యుగే భారత్’ అంటూ భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశపు కొత్త పార్లమెంట్ లో ఒక సరికొత్త చారిత్రక మ్యూజియంను ఏర్పాటు చేశారు. రైసినా కొండకు చుట్టుపక్కల ఉన్న నార్త్ – సౌత్ బ్లాక్‌లలో ఏర్పాటు చేయబడిన కొత్త పునరుద్ధరించబడిన నేషనల్ మ్యూజియంను మోడీ జాతికి అంకితం చేయనున్నారు. వర్చువల్ వాక్‌త్రూ సెట్ అయిన ‘యుగే-యుగే భారత్’ను మే 18న ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ వర్చువల్ వాక్‌త్రూ జాతీయ స్థాయికి సంబంధించిన మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా మ్యూజియం ఈ మ్యూజియం అందరినీ కట్టిపడేస్తుందని అంటున్నారు.
మూడు రోజుల ‘యుగయుగే భారత్’ మ్యూజియం ప్రదర్శనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 18న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ప్రదర్శనను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా..
మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు ప్రధాన మంత్రి మోదీ ఎక్స్‌పో మస్కట్‌ను ఆవిష్కరిస్తారు. సింధు నాగరికత చరిత్రను తెలియజేసే డ్యాన్స్ గర్ల్ (మొహెంజో–దారో నుంచి కనుగొనబడింది) ‘చన్నపట్నం బొమ్మల రూపంలో శైలీకృతం చేయబడుతుంది’, మ్యూజియంపై గ్రాఫిక్ నవల, భారతీయ మ్యూజియంల డైరెక్టరీ, కర్తవ్య పథం పాకెట్ మ్యాప్, భారతదేశంలోని వివిధ మ్యూజియంల గురించి తెలియజేసేలా ఏర్పాట్లు చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముగ్ధా సిన్హా ెలిపారు.
సెంట్రల్ విస్టా మ్యూజియంపై ప్రదర్శన..
ఈ వేడుకల్లో భాగంగా సెంట్రల్ విస్టాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లో నిర్మిస్తున్న నేషనల్ మ్యూజియం గురించి మోదీ ప్రజంటేషన్ చేస్తారు. వర్చువల్ వాక్‌త్రూను కూడా ప్రధాని ప్రారంభిస్తారని సిన్హా తలిపారు. రాబోయే మ్యూజియం ‘యుగే యుగే భారత్ నేషనల్ మ్యూజియం’గా పిలువబడుతుందని 5 వేల సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న భారతదేశం నాగరికత సంస్కృతిని ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు.
1,200 మ్యూజింయలు..
జాయింట్ సెక్రటరీ తన ప్రదర్శనలో పాల్గొనే స్థాయి పెద్దదిగా ఉంటుందని, దాదాపు 1,200 మ్యూజియంలు దాని వివిధ విభాగాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత దేశం నుంచి ఎంపిక చేసిన 75 అంశాలను ఎంపిక చేసి ప్రదర్శరనకు సిద్ధంగా ఉంచారు. స్వాతంత్య్రానికి పూర్వం నాటి పుస్తకాలు, ప్రచురణల కవర్‌ల ప్రదర్శనలు మరియు రాగమాల సిరీస్‌ను ప్రదర్శించనున్నారు.
ప్రత్యేక యాప్..
ప్రదర్శనలో భాగంగా ప్రత్యేక యాప్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈమేరకు ‘ఇండియన్ మ్యూజియం టైకూన్’ పేరుతో యాప్ రూపొందించారు. ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో దీనిని డౌన్‌లోడ్ చేసుకుని భారతదేశ చరిత్రను తెలుసుకునే వీలు ఉంటుంది. ఇందులో భారతదేశంలోని మ్యూజియంల డైరెక్టరీ దేశవ్యాప్తంగా ఉన్న 1,200 మ్యూజియంలు నేషనల్ మ్యూజియం ఇనిస్టిట్యూట్స్ పొందుపర్చారు.
పాకెట్ మ్యాప్..
కర్తవ్య మార్గం పాకెట్ మ్యాప్‌లో ఇండియా గేట్ చుట్టూ బ్రిటీష్ కాలంలో నిర్మించిన వివిధ స్టేట్ హౌస్ లేదా కోటా హౌస్ మరియు జైపూర్ హౌస్ వంటి భవనాలు మరియు సాంస్కృతిక ప్రదేశాలు మరియు సాంస్కృతిక సంస్థల మంత్రిత్వ శాఖపై సమాచారం ఉంటుంది. ఈ ఎక్స్‌పో సందర్భంగా పరిరక్షణపై హ్యాండ్‌బుక్, మ్యూజియంలపై పిక్టోరియల్ బిబ్లియోగ్రఫీని కూడా విడుదల చేయనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ముంబైకి చెందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయతో కలిసి ‘మొబైల్ మ్యూజియం’ రూపొందించింది. మ్యూజియంలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ బస్సు జాతీయ రాజధాని ప్రాంతమంతా తిరుగుతుందని అధికారులు తెలిపారు.