Modi Dosa : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి ప్రజల మనసులను గెలుచుకునే విధంగా మాట్లాడారు. దీనికి కారణం ఓ దోశ. రాష్ట్రంలోని కోలార్ లో ప్రధాని మాట్లాడిన దోశ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధాని నోట ఓ దోశ మాట అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ దోశ ముల్ భగల్ దోశ. దీని పేరు వినని వారు ఉండరు. దోశ ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఇది సాధారణ దోశలా కాదు. దీని ప్రత్యేకత దీనిదే. దీన్ని తయారు చేసే విధానం వేరు. అందుకే దీనికి ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఇనుప తావాపై కాలుస్తారు. ఒక వైపు ఎర్రగా లోపల మెత్తగా ఉంటుంది. ఎర్రని చట్నీ వేసుకుని తింటే ఆ మజాయే వేరు. దీంతో మోదీ తన ప్రసంగంలో ఈ దోశ గురించి మాట్లాడటంతో అక్కడి వారి కరతాళ ధ్వనులతో మారుమోగించారు.
ప్రధాని ప్రసంగంతో ప్రజల ఉత్సాహం చూస్తే బీజేపీని విజయం ముంగిట నిలిచేలా చేస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి అక్కడి ప్రజల మన్ననలు గెలిచే ఉద్దేశంలో భాగంగానే నరేంద్రమోడీ ప్రాంతీయ అభిమానం చూరగొనేందుకు ప్రయత్నించారు. ఇది ఎంత మార్పు తీసుకొస్తుందో తెలియడం లేదు. దోశను నమ్ముకుని బీజేపీ ఎన్నికల ప్రచారంలో దిగినట్లు కనిపిస్తోంది.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మారింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజల మనుసులు గెలుచుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండు పార్టీలు తమ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నాయి. మొత్తానికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో లెక్కింపు వరకు ఆగితేనే తెలుస్తుంది.