Ram Mandir: అమేజాన్ ప్రపంచంలో అతిపెద్ద ఈకామర్స్ సంస్థ. చిన్న పిన్ను నుంచి భారీ ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నీ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న అమేజాన్ అయోధ్య పేరు చెప్పి కస్టమర్లకు నకిలీ ప్రసాదం అమ్మకాలు మొదలు పెట్టి అభాసుపాలైంది. ఇప్పుడీ వార్తలు కలకలం రేపుతున్నాయి.
దేవుడి పేరు చెప్పి..
లాభాపేక్ష కోసం ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమేజాన్ చీప్ ట్రిక్స్‌కు దిగింది. అయోధ్య రాముడి పేరు చెప్పి ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలు పెట్టింది అమేజాన్. దీంతో రామ భక్తులు, ప్రజలు కొనుగోలుకు భారీగా ఆర్డర్లు ఇచ్చారు. డబ్బుల కోసం అమేజాన్ కంపెనీ ఇంతలా దిగజారడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరక ముందే దిగ్గజ కంపెనీ రాముడి పేరుతో ప్రసాదాల అమ్మకం మొదలు పెట్టడంపై కేంద్రం కూడా సీనియస్ అయింది. అమెజాన్ ఫ్రాఢ్ ని గమనించి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌కు కూడడా ఫిర్యాదు చేసింది. మరోవైపు నకిలీ ప్రసాదం విక్రయంపై రంగంలోకి దిగిన అధికారులు అమెజాన్‌కు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తరఫున నోటీసులు జారీ చేశారు.
మామూలు దూద్‌పేడ అమ్మకం..
మామూలు దూద్‌పేడను అయోధ్య లడ్డూ పేరిట అమేజాన్ విక్రయించడంపై సెంట్రల్ కన్సూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమేజాన్ అయోధ్య ప్రసాదం ముసుగులో మిఠాయిల అమ్మకాలు జరపడంపై సీఏఐటీ చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా చర్యలకు దిగింది. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట..
దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. జనవరి 22న జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం దేశంలోని ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. అయితే దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపార దిగ్గజం అమేజాన్‌తోపాటు మరికొన్ని ఈకామర్స్ కంపెనీలు తమ వ్యాపారం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయోధ్య ప్రసాదం, విభూది, హారం, అక్షింతలు అంటూ ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలు పెట్టాయి. కొందరు భక్తులు వీటిని నమ్మి ఆర్డర్లు ఇస్తున్నారు. అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగలేదు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆన్‌లైన్‌లో ప్రసాదాల విక్రాయినికి అనుమతి ఇవ్వలేదు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగకుండానే ప్రసాదాలు ఎలా విక్రయిస్తారనే చిన్న లాజిక్ మర్చిపోయిన భక్తులను వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రజలు ఈ విషయం గమనించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోరుతోంది.