Paytm: పేటీఎంలో వివాదం.. ఫాస్టాగ్ డీ – యాక్టివేట్ ఎలా?

ప్రస్తుతం పేటీఎం సంస్థ 2.4 కోట్ల మంది వాహనదారులకు ఫాస్టాగ్ సేవలు అందిస్తోంది. అయితే ఇందులో నెలకొన్న వివాదం నేపథ్యంలో అధికృత బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 1:43 pm
Follow us on

Paytm: పేటీఎం ను రిలయన్స్ దక్కించుకుంటుంది.. త్వరలో పేటీఎం నుంచి మాతృ సంస్థ బయటికి వెళ్ళిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం 2.40 కోట్ల మంది పై పడే అవకాశం ఉంది. అయితే, వీరంతా ఫాస్టాగ్ లను డీ- యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకును కూడా కొత్తది ఎంచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఫాస్టాగ్ వినియోగదారులకు ఒక తీపి కబురు చెప్పింది. దేశంలోని 32 అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ సేవలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

ప్రస్తుతం పేటీఎం సంస్థ 2.4 కోట్ల మంది వాహనదారులకు ఫాస్టాగ్ సేవలు అందిస్తోంది. అయితే ఇందులో నెలకొన్న వివాదం నేపథ్యంలో అధికృత బ్యాంకు నుంచి కొత్త ఫాస్టాగ్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ 32 అధికృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు కొత్త ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేలా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది. 19న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ లను చెల్లుబాటు కాకుండా చర్యలు తీసుకుంది.

వాస్తవానికి వినియోగదారులు వాడే వాహనానికి ఫాస్టాగ్ ను పేటీఎం సంస్థ జీవిత కాలం ఉండేలాగా జారీ చేసింది. పేటీఎం లో నెలకొన్న వివాదం నేపథ్యంలో అప్పట్లో అది జారీ చేసిన ఫాస్టాగ్ ను డీ యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికోసం వినియోగదారులు ఇలా చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్ లో కి లాగిన్ కావలసి ఉంటుంది. ఆ తర్వాత ఐడి, పాస్వర్డ్ సహాయంతో వ్యాలెట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఫాస్టాగ్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం హెల్ప్, సపోర్ట్ ను ఎంచుకోవాలి. లో లీడ్ హెల్ప్ విత్ నాన్ ఆర్డర్స్ క్వరీస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో ఫాస్టాగ్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. ఇందులో ఐ వాంట్ క్లోజ్, ఫాస్టాగ్ అండ్ ఫాలో ఫర్ దర్ ఇన్ స్ట్రక్షన్స్” అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం వచ్చే సూచనలు పాటించాలి. పేటీఎం నుంచి ఫాస్టాగ్ ను పోర్ట్ చేయడానికి.. బదిలీకి ఎంచుకున్న బ్యాంకు కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి.. కస్టమర్ కేర్ అధికారి అడిగిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఇతర సమాచారాన్ని ఇస్తే వారు ఫాస్టాగ్ పోర్ట్ చేస్తారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జారీచేసిన అధికృత బ్యాంకుల జాబితాలో ఎయిర్టెల్ పేమెంట్స్, అలహాబాద్, యాక్సిస్, బరోడా, మహారాష్ట్ర, కెనరా, హెచ్డిఎఫ్సి, ఫెడరల్, కోటకే మహీంద్రా, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐ డి ఎఫ్ సి ఫస్ట్, ఇండియన్, ఇండస్ ఇండ్, సౌత్ ఇండియన్, పంజాబ్ నేషనల్, యూనియన్, ఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు ఉన్నాయి.. అయితే పేటీఎం ఇప్పటివరకు నోడల్ అకౌంట్ కస్టమర్, వ్యాపారుల లావాదేవీలు నిర్వహించే మాస్టర్ ఖాతా లాగా పని చేసింది. పేటీఎం వివాదం ఒకవేళ ముగిసినప్పటికీ అది ఫాస్టాగ్ సేవలు నిర్వహించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.